Guppedantha Manasu December 19th Episode : శైలేంద్ర కొత్త ప్లాన్ వేస్తాడు. కాలేజీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీటింగ్ కోసం రెడీ అవుతాడు. పూర్తిగా కోల్కున్నాక, కాలేజీకి వెళ్లడం మంచిదని దేవయాని అంటుంది. కానీ, వెళ్లాల్సి ఉందని శైలేంద్ర పట్టు పడతాడు. తాను ఇంట్లో ఉంటే, బాబాయ్ కోపంగా వచ్చి రచ్చ రచ్చ చేశాడని చెప్తాడు. మహేంద్ర అలా చేస్తాడని, తను ఊహించలేదని అనుపమ వాళ్ళు రాకపోతే, పరిస్థితి ఇంకో విధంగా ఉండేదని దేవయాని అంటుంది. అందరికీ నా పరిస్థితి తెలియాలి. అందుకైనా కాలేజీకి వెళ్తానని తల్లితో శైలేంద్ర చెప్తాడు.
శైలంద్ర కాలేజీకి వెళ్లబోతున్నాడని తెలిసి, భర్తపై సెటప్ వేస్తుంది. ధరణి కాలేజీకి వెళ్లి శైలేంద్ర ఏ పని చేస్తుంటాడని దేవయాని అంటుంది ఫైల్స్ చెక్ చేస్తుంటాడని, కోడలికి వ్యంగ్యంగా బదిలిస్తుంది. అవేవో మావయ్యకే చెప్పి ఇక్కడికి తెప్పిస్తానని ధరణి అంటుంది. కానీ తను కాలేజీకి వెళ్లాల్సిందేనని అంటాడు. ఆరోగ్యంగా కంటే ఆత్మగౌరవం ముఖ్యము అని భార్యతో చెప్తాడు. రిషి కనపడకుండా పోవడానికి కారణం నేనని బాబాయ్ నన్ను అనుమానించడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. రిషి గురించి ఎంక్వైరీ చేసి ఎక్కడున్నాడో కనిపెడతానని చెప్తాడు.
కాలేజీని సొంతం చేసుకోవడానికి. ఏదో ఒక ప్లాన్ వేస్తున్నట్లు ధరణికి అర్థం అవుతుంది. తాను కూడా వస్తానని అంటుంది. కానీ దేవయాని ఒప్పుకోదు. రిషి కనపడకుండా పోయిన విషయాన్ని సీక్రెట్ గా ఉంచడం కోసం, అతడు మిషన్ ఎడ్యుకేషన్ పనులు మీద అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళాడని, నోటీస్ ఇవ్వడం పై వసుధార బాధపడుతుంది. ఆ విషయం వసుధారని అడుగుతుంది. అనుపమ అలా చేసినందుకు, నాకు గిల్టీ గానే ఉందని చేయాల్సి వచ్చింది అని చెప్తుంది.
రిషి కాకుండా, తాను కనపడకుండా పోయినా బాగుండునని అనుకుంటుంది. వసుధార ని ఓదారుస్తుంది అనుపమ. వసుధార అన్న పేరు బ్రాండ్. నువ్వు ఎదిగిన గ్రాఫ్. నలుగురికి ఆదర్శమని అంటుంది. మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేస్తుందని మహేంద్ర వసుధార తో అంటాడు. దేవయానితో కలిసి కాలేజీకి వస్తాడు శైలేంద్ర. కాలేజీని చూసి ఇది నీ సామ్రాజ్యం ఇది నువ్వు ఎలాల్సిన సామ్రాజ్యం అని కొడుకుతో అంటుంది. ఇక్కడ ఉన్న సింహాసనం అదే ఎండి సీట్ లో నువ్వు కూర్చోవాలి అంటుంది. సీట్ లో ఎప్పుడు కూర్చుంటానా అని తను ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తాడు.
వసుధార అడ్డుపడుతుందేమోనని, శైలేంద్ర అనుమానపడతాడు. ఆమె గురించి ఆలోచించొద్దు అని, నేనున్నానని చెప్తాడు. వసుధార ఎండి క్యాబిన్లో లేదని తెలుసుకుని ఆ రూమ్ కి వస్తాడు. శైలేంద్ర భూషణ్ అనే పేరు టేబుల్ పై ఎప్పుడు ఉంటుందోనని శైలేంద్ర అంటాడు. ఎండి సీట్ లో కూర్చోడానికి రెడీ అవుతాడు. మనల్ని ఎవరు రా ఆపేది అంటూ కొడుకుని ప్రోత్సహిస్తుంది దేవయాని. వసుధార వచ్చి ఆపేస్తుంది. ఈ సీట్లో మీరు కూర్చోవద్దు అది రిషి కి వార్నింగ్ ఇస్తుంది.
రిజర్వ్ చేసి పెట్టానని చెప్తుంది. అందులో కూర్చోవాలంటే, అర్హత ఉండాలని అంటుంది. నా కొడుకు ఫారెన్ లో చదువుకుని వచ్చాడు. అది చాలాదా అని అంటుంది. ఒక పదవిలో కూర్చోవాలంటే డిగ్రీ ఉంటే చాలదు. నాయకత్వ లక్షణాలు ఉండాలి అని అంటుంది. తను పేషెంట్ ని అని, రెండు నిమిషాల కూర్చుని రిలాక్స్ అయి వెళ్ళిపోతానని శైలేంద్ర చెప్తాడు. పేషెంట్ అయినా కూర్చోకూడదని అవసరమైతే వీల్ చైర్ తెప్పిస్తానని, లేకపోతే స్ట్రక్చర్ తెప్పించి, డైరెక్టుగా హాస్పిటల్ లో చేర్పిస్తారని అంటుంది. ఎండి సీటు మీద చెయ్యి వేసి ఉండడం చూసి ఫైర్ అవుతుంది. ఆ చేయి తీయమని వార్నింగ్ ఇస్తుంది.
ఇది మా కాలేజ్ అని దేవయాని అంటుంది. మీ పెత్తనాలు ఇంట్లో చూపించుకోండి ఇక్కడ కాదు. ఇది కాలేజీ అని అంటుంది. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ అని వసుధారతో అంటుంది దేవయాని. మీ విషయంలో తక్కువ చేస్తున్నాను అని అంటుంది వసుధార. ఎండి సీట్ నుండి దూరంగా జరగండి అని చెప్తుంది. నువ్వు నా కొడుకుని రెచ్చ కొడుతున్నావు అని వసుధారతో అంటుంది. రెచ్చిపోవడానికి పశువా శైలేంద్ర అని అవమానిస్తుంది. అక్కడే ఉన్న అటెండర్ ని పిలిచి ఎవరు పడితే వాళ్ళు ఎండి క్యాబిన్లో వస్తే నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…