వినోదం

Guppedantha Manasu December 15th Episode : శైలేంద్రను గ‌న్‌ తో కాల్చిన మ‌హేంద్ర‌.. వ‌సుధార‌ బాధ్య‌తని అనుపమకు అప్పగించిన మహేంద్ర..!

Guppedantha Manasu December 15th Episode : శైలేంద్ర దారుణాలని చూస్తూ, చేతకాని వాడిలా ఉండిపోయానని అనుపమతో మహేంద్ర అంటాడు. రిషి ని మాకు దూరం చేశాడని తెలిసిన రోజే, వాడిని చంపి ఉండాల్సిందని ఆవేశపడతాడు, మేము వేసే ఎత్తుకు పై ఎత్తు వేసి, తప్పు మాదే అని నిరూపిస్తున్నాడని, రాక్షసుడులా రోజు రోజుకి ప్రవర్తన మితిమీరి పోతోందని, అనుపమకి మహేంద్ర చెప్తాడు. నా ప్రాణానికి ప్రాణమైన జగతిని చంపేసిన శైలేంద్రని, రిషి ముందు సాక్షాలతో నిలబెట్టాలని అనుకున్నాను. కానీ అది జరిగేలా లేదని, మహేంద్ర బాధపడతాడు. రిషికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనని చెప్తాడు. రిషికి ఏం కాదని ధైర్యంగా ఉండమని చెప్తుంది అనుపమ.

కంటికి రెప్పలా వసుధారను చూసుకుంటానని, నాకు మాట ఇవ్వమని అనుపమని అడుగుతాడు. తన బాధ్యత నువ్వు తీసుకోవాలని అంటాడు. నాకు ఎందుకు బాధ్యత అప్పగిస్తున్నామని అడుగుతుంది అనుపమ. మహేంద్ర మాటలు కొత్తగా ఉండడంతో, అనుపమకి కంగారు వస్తుంది. పిచ్చి పని ఏమైనా చేయబోతున్నావా అని అడుగుతుంది. రిషి పై బెంగతో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంది. జరిగేది, జరగబోయేది చూస్తూ ఉండటం తప్ప, తాను ఏం చేయలేనని మహేంద్ర చెప్తాడు.

నువ్వు నాకు సపోర్ట్ చేసిన చేయకపోయినా వసు కి అండగా ఉండాలని, అనుపమతో మహేంద్ర అంటాడు. వసుధార జాగ్రత్తని చెప్తాడు. ఎండి సీట్ ని తనకి అప్పగించాలని కండిషన్ కి వసుధార తప్పకుండా ఒప్పుకుంటుందని సంతోషంలో ఉంటాడు శైలేంద్ర. తొందరలోనే ఎండి కాబోతున్నట్లు ఊహల్లో తేలిపోతాడు. అతనికి ఎదురుగా మహేంద్ర కనపడటంతో సైలేంద్ర షాక్ అవుతాడు. డాడీ ఇంట్లో లేరు కదా, మీరు ఎందుకు వచ్చారని భయంగా అంటాడు. నీకోసమే వచ్చాను అని మహేంద్ర చెప్తాడు.

Guppedantha Manasu December 15th Episode

వసుధార మొత్తం అతనికి చెప్పేస్తుందని శైలేంద్ర కి అర్థమవుతుంది. ధరణిని పిలుస్తాడు. శైలేంద్ర రూమ్ నుండి వెళ్ళిపోకుండా, రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు మహేంద్ర. రిషి ఎక్కడున్నాడని శైలేంద్ర ని అడుగుతాడు. రిషి ఎక్కడున్నాడో తనకి తెలియదని, అతని గురించి మీకు ఎంత తెలుసో, నాకు కూడా అంతే తెలుసు అని మహేంద్రతో అబద్ధం చెప్తాడు శైలేంద్ర. నా సహనాన్ని పరీక్షించకు. నిజం చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. నేను నిజం చెప్తున్నాను అని మీరే నమ్మట్లేదని శైలేంద్ర అంటాడు. శైలేంద్రని ఒకటి కొట్టి అడుగుతాడు.

తర్వాత శైలేంద్ర ఏదో చెప్తే మళ్ళీ ఇంకొకటి కొడతాడు. అయినా శైలేంద్ర నిజం చెప్పకపోవడంతో, మహేంద్ర గన్ తీసి, రిషి ఎక్కడున్నాడో చెప్పమని బెదిరిస్తాడు. దేవయానిని, ధరణిని పిలుస్తాడు. బాబాయ్ తనని చంపేస్తున్నాడని చెప్తాడు. దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది. రూమ్ మూసి ఉండడంతో వదిలేయమని వేడుకుంటుంది. నీ నిజ స్వరూపం తెలిసిన రోజే చంపేయాలి. కానీ అన్నయ్య ముఖం చూసి వదిలేసానని మహేంద్ర అంటాడు. కొడుకుని కాపాడమని బతిమిలాడుతుంది దేవయాని. రిషి ఎక్కడున్నాడో చెప్తే శైలేంద్ర ని ఏం చేయకుండా, మహేంద్ర ని తాను అడ్డుకుంటానని చెప్తుంది.

రిషి ఎక్కడున్నాడో శైలేంద్ర కి తెలియదని, పోనీ మీకు తెలుసా అని ధరణి అడుగుతుంది. నాకు తెలియదని తడబడుతుంది. అయితే, మీరే మీ కొడుకుని కాపాడుకోమని చెప్తుంది. భర్త చనిపోతే నీ పసుపు కుంకుమలు పోతాయని దేవయాని అంటుంది. ధరణి సైలెంట్ గా ఉంటుంది. చివరగా రిషి ఎక్కడున్నాడో చెప్పమని మహేంద్ర అంటాడు. ఈసారి చెప్పకపోతే షూట్ చేస్తానని అంటాడు.

వసుధారా చెప్తే వింటాడని, తనకి ఫోన్ చేస్తుంది. కానీ మహేంద్ర వినడు. శైలేంద్ర ని చంపిన తర్వాత, ఇక్కడ నుండి కదులుతానని శైలేంద్రని కాల్చి పడేస్తే, అందరి జీవితాలు బాగుపడతాయని, ఈ విషయంలో ఎవరి మాట విననని ఫోన్ కట్ చేస్తాడు. రిషి ఎక్కడున్నాడో చెప్పకపోయినా, నిన్ను క్షమించను అని, చంపి తీరుతానని అంటాడు. తెలివిగా గన్ ని కింద పడేసి రూమ్ నుండి పారిపోతాడు శైలేంద్ర. అయినా శైలేంద్రని పట్టుకుని షూట్ చేస్తాడు మహేంద్ర.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM