Guppedantha Manasu December 14th Episode : రిషిని కిడ్నాప్ చేసిన శైలేంద్ర.. భ‌ర్త కోసం ఎండీ సీట్‌కు రాజీనామా..?

December 14, 2023 10:06 AM

Guppedantha Manasu December 14th Episode : వసుధార శైలేంద్రని బెదిరిస్తుంది. కానీ, వసుధారా శైలేంద్ర అన్న దానికి భర్త ఎక్కడున్నాడో చెప్పమని వేడుకుంటుంది కూడా. రిషి ఎక్కడున్నాడో చెప్తే నాకేంటి అని అంటే ఎండి సీట్ కావాలి అని, మనసులో ఉన్న అసలైన కోరికని శైలేంద్ర చెప్తాడు. అది నువ్వు బతికి ఉండగా జరగదని శైలేంద్ర ని వసుధార బెదిరిస్తుంది. జగతి పిన్ని కూడా, కొడుకుకి ఎండి సీటు అప్పగించాలని కాపాడుకుంది. చివరికి కొడుకు పక్కన లేకుండా పోయింది. రేపు నీకు ఏమైనా అయితే, రిషి ని ఎవరు చూసుకుంటారు అని అంటాడు.

ఎండి సీట్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎంతమంది ప్రాణాలైనా తీస్తాను. అసలు ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేకపోయినా, చేయాల్సి వస్తోంది అని, శైలేంద్ర అంటాడు. పిన్ని చనిపోయిన తర్వాత, ఎండి సీటు దక్కుతుందని అనుకున్నాను. కానీ నీ మొగుడు నిన్ను కూర్చోబెట్టాడని వసుధారతో శైలేంద్ర చెప్తాడు. ఆ సీట్లో నుండి తప్పుకోవాలంటే నువ్వు వినట్లేదు. అందుకే ఇక వెయిట్ చేయడం వేస్ట్ అని, ఈ దారి ఎంచుకున్నాను అని వసుధారని భయ పెడతాడు. భర్తనా ఎండి సీట్ ఆ అనేది ఆలోచించుకో. నాకు ఎండి సీట్ అప్పగిస్తేనే, నీ భర్త ప్రాణాలతో తిరిగి వస్తాడు అని చెప్తాడు.

బ్లాక్మెయిల్ చేస్తాడు కూడా. శైలేంద్ర మాటలతో కన్నీళ్ళతో ఇంటికి వెళ్తుంది. రిషి క్షేమంగా వదిలిపెడతానని శైలేంద్ర చెప్పిన మాటలే తనకి గుర్తు వస్తాయి. రిషి ని నిజంగా సైలేంద్ర కిడ్నాప్ చేశాడా..? ఒకవేళ శైలేంద్ర చెప్పింది అబద్ధం అయ్యి, రిషి తిరిగి వస్తే అతడికి ఏమని సమాధానం చెప్పాలి. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక తల్లడిల్లిపోతుంది. ఆవేశంగా వెళ్లిన వసుధార కన్నీళ్ళతో ఇంటికి వస్తుంది. ఎండి సీట్ నాకు అక్కర్లేదని, ఆ పదవిలో తాను కొనసాగనని చెప్తుంది. ఎండి సీట్ ని వదిలేస్తేనే రిషి సార్ ఎక్కడున్నాడో తెలుస్తుందని, ఆ పదవి వద్దనుకుంటేనే రిషి వస్తాడని శైలేంద్ర బెదిరించిన విషయాన్ని మహేంద్ర అనుపమలకు చెప్తుంది.

Guppedantha Manasu December 14th Episode today
Guppedantha Manasu December 14th Episode

మహేంద్ర ఆవేశానికి లోనవుతాడు. నా భర్త క్షేమం కోసం రాజీనామా చేస్తానని అంటుంది వసుధార. అది నీకు అప్పగించిన బాధ్యత అని వసుధారకి సర్ది చెప్పబోతాడు మహేంద్ర. నాకు ఎండి పదవి అప్పగిస్తూ, నీ తెలివితేటలు ప్రతిభ తో కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని రిషి చెప్పిన మాటల్ని వసు గుర్తు చేసుకుంటుంది. రిషి నా పక్కన లేకుండా ఏ పదవి ఉన్నా, అది గడ్డిపరకతో సమానమని వసు ఎమోషనల్ అయిపోతుంది. రిషి ఎవరు కంట్రోల్ లో ఉన్నాడు తెలిసింది.

కాబట్టి అందరం కలిసే ఈ సమస్యని సాల్వ్ చేద్దామని అంటుంది. అంత టైం లేదు. ఆలస్యం చేస్తే, రిషి ప్రాణాలకి శైలేంద్ర ప్రమాదం కలిగే, అవకాశం ఉందని భయపడుతుంది. భర్త శైలేంద్ర కి కాఫీ ఇచ్చి ఆవేశంగా వెళ్ళిపోతుంది ధరణి. ఆమె లో మార్పు రావడాన్ని శైలేంద్ర గమనిస్తాడు. ఏమైందని ధరణిని అడుగుతాడు. నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఏం చేయక్కర్లేదని ధరణి వెళ్ళిపోతుంది. ఆమెని శైలేంద్ర ఆపుతాడు. వసుధారని ఎక్కడ కలిశావు..? నీతో ఏం మాట్లాడిందని కొడుకుని అడుగుతుంది. రిషి కోసమే వచ్చిందని చెప్తాడు. రిషిని తానే కిడ్నాప్ చేశానని ఎండి సీట్ తనకి అప్పగిస్తే రిషి ని వదిలిపెడతానని బెదిరించానని తల్లితో చెప్తాడు శైలేంద్ర.

నువ్వు సూపర్ నాన్న అని కొడుకుని మెచ్చుకుంటుంది దేవయాని. వసుధార కి రిషి అంటే ప్రాణం కనుక అతడి కోసమైనా ఎండి సెట్ నీకు అప్పగిస్తుంది అని, కొడుకుతో దేవయాని అంటుంది. ఎండి సీటు దక్కుతుందని చాలాసార్లు అనుకున్నాను. కానీ జరగలేదు. ఈసారి మాత్రం చేజారిపోదు అని అంటాడు. ఇద్దరు సంబరంతో మునిగిపోతారు. జగతి ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎమోషనల్ అయిపోతుంది. రిషిని వెతకకపోతే, జగతి చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుందని అనుపమ అంటుంది. రిషి లేకుండా తాను బతకలేనని ఆపద వచ్చినా తట్టుకోలేను అని అనుపమకి చెప్తుంది. రిషి ఎక్కడ ఉన్నా మీ ఇద్దరినీ ఒకటి చేస్తానని వసుధారకి అనుపమ మాట ఇస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now