Guppedantha Manasu December 12th Episode : శైలేంద్ర నాట‌కాన్ని బయట పెట్టేసిన ధ‌ర‌ణి.. మారిపోయిన దేవ‌యాని..!

December 12, 2023 9:53 AM

Guppedantha Manasu December 12th Episode : దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటుండగా ధరణి వస్తుంది. దేవయాని కంగారు పడిపోతుంది. ఆమె ఎక్కడ కుట్ర ని బయట పెట్టేస్తుందని భయపడుతుంది. ప్రేమతో ధరణిని నమ్మించాలని, శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. ధరణి, రూమ్ లోకి వచ్చి రావడంతోనే కిల్లర్ తో మాట్లాడిన వాయిస్ మీదే కదా అని ఫైర్ అవుతుంది. రౌడీ కి మీరు డబ్బులు ఇస్తుంటే, చూశానని అందర్నీ మోసం చేసినట్లుగా నన్ను మోసం చేయలేరని అంటుంది. నిజం దాచడం వెనుక ఏదో కుట్ర ఉందని, ధరణి అనుమాన పడుతుంది.

నీకోసమే నిజం దాచానని శైలేంద్ర అబద్ధం చెప్తాడు. నిజం నిరూపితమైతే నాకు శిక్ష పడుతుంది. జైల్లోకి వెళ్తాను. నువ్వు ఒంటరిగా ఉండిపోతావు అని, ధరణి మీద ప్రేమను కురిపిస్తాడు. నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాక, నీ ప్రేమ తప్ప నాకు ఏమీ కనపడలేదని లైఫ్ లాంగ్ నాకు నువ్వు తోడుగా ఉంటే చాలని, ఎండి సీటు కూడా నాకు అక్కర్లేదని, ధరణి ని అబద్ధాలతో నమ్మిస్తాడు శైలేంద్ర. దేవయాని కూడా మారిపోయినట్లు చెబుతుంది. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. సంతోషంగా ఉంటే చాలు అని దేవయాని మంచి దానిలా మారిపోయినట్లు నటిస్తుంది.

అయినా ధరణి కోపం తగ్గదు. ఆవేశంగా రూంలోకి వెళ్ళిపోతుంది. ఎలా కూల్ చేయాలో తెలుసు అని శైలేంద్ర అంటాడు. శైలేంద్ర ye నిజమైన హంతకుడని అనుపమకి చెప్తాడు ముకుల్. టెక్నాలజీని అడ్డు పెట్టుకుని తప్పించుకుంటున్నాడని అంటాడు. రిషి గురించి ముకుల్ ని అడుగుతుంది అనుపమ. లాస్ట్ టైం ఫోన్ సిగ్నల్స్ శైలేంద్ర జాయిన్ అయిన హాస్పిటల్ ఏరియాలోనే చూపించాయని, తర్వాత సిటీలో సిగ్నల్స్ ఎక్కడా కనపడలేదని
ముకుల్ అంటాడు.

Guppedantha Manasu December 12th Episode today
Guppedantha Manasu December 12th Episode

రిషి కార్ కూడా బయట దొరికిందని చెప్తాడు. అనుపమ కంగారుపడుతుంది రిషి ని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? ఏదైనా ప్రమాదం జరిగిందా అని తెలియట్లేదని ముకుల్ చెప్తాడు. ఎంత ట్రై చేసినా ఎలాంటి క్లూ కూడా దొరకలేదని అంటాడు. శైలేంద్ర మీద ఎటాక్ కావాలని అతను చేయించుకున్నట్లు అనిపిస్తోందని అనుపమ కి చెప్తాడు ముకుల్. జగతి హత్య విషయంలో సైలేంద్ర కుటుంబం ఇన్వాల్వ్ ఉంటుందని చెప్తాడు శైలేంద్ర మీద అటాక్ చేసిన రౌడీలు అతన్ని కలవడానికి ఇంటికి వస్తారు. ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతుండగా ధరణి చూస్తుంది. చాటు నుండి మాటలు వింటుంది.

ప్రతిదీ నేను చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం అద్భుతంగా చేశారని రౌడీలని మెచ్చుకుంటాడు శైలేంద్ర. ఇదంతా భర్త ఆడించిన డ్రామా అని ధరణి తెలుసుకుంటుంది. భర్త మారిపోయాడన్నది అబద్ధమని, అతను ఆడుతున్నది నాటకం అని అర్థం చేసుకుంటుంది. తను మౌనంగా ఉంటే, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడు అని భయపడుతుంది ధరణి. శైలేంద్ర నిజ స్వరూపం వసుధార, మహేంద్ర లకి చెప్పాలని అనుకుంటుంది. రిషి గురించి మహేంద్ర వసు ఆలోచిస్తుండగా ధరణి కంగారుగా వారి దగ్గరికి వస్తుంది.

జగతి ప్రాణాలు తీసింది శైలేంద్ర అని చెప్తుంది. శైలేంద్ర కిల్లర్ కి డబ్బులు ఇస్తుండగా చూసానని, ముకుల్ వినిపించిన వాయిస్ శైలేంద్ర తో పాటు మరో వాయిస్ ఆ కిల్లర్ ది అని చెప్తుంది. జగతి గురించి తానే వసుధారకి చెప్పి హెచ్చరించానని చెప్తుంది. ఎటాక్ గురించి ఎవరికీ అనుమానం రాకుండా, నా కళ్ళముందే అదంతా జరిగేలా ప్లాన్ చేశాడని అంటుంది. అనుపమ ధరణి మాటలు విని షాక్ అవుతుంది. శైలేంద్ర దుర్మార్గాల గురించి మీకు తెలియదని, మొదటి నుండి రిషి ని చంపడానికి శైలేంద్ర ప్రయత్నించాడని అనుపమతో చెప్తుంది ధరణి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now