Dunki OTT : ఏంటి.. షారూఖ్ ఖాన్ డంకీ చిత్రం ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా.. నిజంగా ఇది షాకింగే..!

December 23, 2023 10:03 AM

Dunki OTT : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల షారూఖ్ షారూఖ్ ఖాన్ మంచి హిట్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, తాప్సీ జంటగా విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో డంకీ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ డిసెంబ‌ర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో సూప‌ర్ డూప‌ర్ హిట్ షారూఖ్ ఖాన్ కొట్ట‌డంతో ఆయ‌న న‌టించిన డంకీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు సినిమాలు మాస్ యాక్షన్ అయితే డంకీ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది.

చిత్రంలో షారుఖ్ ఖాన్.. హార్డీ పాత్రలో ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులు ఏడ్చేలా చేస్తాడు. ఇక 50 ఏళ్ళ వయసు పాత్రలో కూడా షారుఖ్ అద‌ర‌గొట్టాడు. తాప్సి కూడా యంగ్, ముసలి పాత్రలో ఎమోషన్ తో మెప్పిస్తుంది. విక్కీ కౌశల్ గెస్ట్ రోల్ చేసినా ఉన్న పావుగంట ప్రేక్షకులని చాలా ఎమోష‌న‌ల్ అయ్యేలా చేస్తాడు. మొత్తంగా షారుఖ్ ఖాన్ గత సినిమాల్లో యాక్షన్ తో మెప్పిస్తే ఈ సారి రాజ్ కుమార్ హిరాణి మార్క్ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని నవ్వించి, ఏడిపించాడు అని చెప్పాలి. ఈ చిత్రంతో షారూఖ్ ఖాన్ త‌న ఖాతాలో మ‌రో మంచి హిట్ చిత్రం వేసుకున్నాడ‌నే చెప్పాలి.

Dunki OTT know the platform and streaming details
Dunki OTT

పఠాన్, జవాన్ తరహాలోనే హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డంకీని విడుదల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో కేవలం హిందీలోనే డంకీని రిలీజ్ చేశారు. అయితే డంకీ ఏ ప్లాట్‌ఫాంలో రానుంద‌నే ఆలోచ‌న అంద‌రిలో ఉండ‌గా, దీనికి ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దాంతో జియో సినిమాలో డంకీ స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. రూ. 155 కోట్లు పెట్టి డంకీ సినిమాని జియో కొనుగోలు చేసిందని స‌మాచారం. మరి ఎప్పుడు దీనిని స్ట్రీమింగ్ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now