Ravi Teja : ర‌వితేజ అస‌లు పేరు ఏంటో తెలుసా..?

March 5, 2023 3:56 PM

Ravi Teja : మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఈ మ‌ధ్యే వాల్తేరు వీర‌య్య‌లో గెస్ట్ రోల్ చేసిన విష‌యం విదిత‌మే. ఈ మూవీ ర‌వితేజ‌కు స్ట్రెయిట్ మూవీ కాదు. గెస్ట్ రోల్ పాత్ర ఉన్న మూవీ. క‌నుక ఆయ‌నను హీరో అని అన‌లేం. అయితే అంత‌కు ముందు తీసిన ఆయ‌న మూవీలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఒక్క క్రాక్ మూవీ మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించింది. ఇక త్వ‌ర‌లో ఆయ‌న టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావుగా మ‌న ముందుకు రానున్నాడు. అయితే ర‌వితేజ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించాడు.

రవితేజకు గాడ్ ఫాద‌ర్ అంటూ ఎవ‌రూ లేరు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి. అందువ‌ల్లే ఆయ‌న సినిమాల‌ను చూసి న‌టుడు అయ్యాడు. మొద‌ట్లో ర‌వితేజ కొన్ని సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కూడా ప‌నిచేశాడు. ఇక చిన్నతనం నుండే రవితేజకు సినిమాలంటే చాలా ఆసక్తి. తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో సినిమాలు చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ చివరికి స్టార్ హీరో అయ్యాడు. రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల ద్వారా హీరోగా నిలదొక్కుకున్నాడు.

do you know the real name of Ravi Teja
Ravi Teja

రవితేజ ప్రస్తుతం టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలో నటిస్తుండగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. రవితేజ బలుపు, పవర్, రాజా ది గ్రేట్ సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ర‌వితేజ అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. కానీ ఆయ‌న‌కు ర‌వితేజ‌గా మంచి పేరు వ‌చ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now