Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయస్సులోనూ బాలయ్య కుర్ర హీరోలకు పోటీగా నటిస్తూ అంతే మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటున్నారు. అయితే కొంత కాలంగా ఆయనకు సరైన హిట్లు లేవు. కానీ బోయపాటితో తీసిన అఖండ ఆయనకు మళ్లీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఆయన నటించిన వీర సింహారెడ్డి మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘన విజయం సాధించింది. ఓటీటీలోనూ ఈ మూవీ దూసుకుపోతోంది.
బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. పౌరాణిక, సామాజిక, జానపద చిత్రాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్‌టీఆర్ తరువాత ఆ స్థాయిలో డైలాగ్స్ పలకగలిగే గొప్ప నటుడిగా బాలయ్య పేరుగాంచారు. అయితే అందరు నటుల కెరీర్‌లో కొన్ని సినిమాలు ఆగిపోయినట్లే బాలయ్య కెరీర్‌లోనూ కొన్ని మూవీలు ఆగిపోయాయి. ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ ప్రధాన పాత్రలో భగవాన్ శ్రీ కృష్ణ అనే మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇందులో బాలయ్య కృష్ణుడిగా కనిపించాల్సి ఉంది. అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అలాగే అశోక చక్రవర్తి జీవితగాథ ఆధారంగా సామ్రాట్ అశోక అనే మూవీ తీయాలనుకున్నారు. ఇదీ పట్టాలెక్కలేదు. సౌందర్య ద్రౌపదిగా నర్తనశాలను తెరకెక్కించాలనుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా అయింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. తరువాత ఇంకో హీరోయిన్ ను పెట్టి తీద్దామనుకున్నా వీలు కాలేదు. అలాగే రైతు, శివరంజని అనే మరో రెండు మూవీలు కూడా ఆగిపోయాయి. ఇవి చేసి ఉంటే బాలయ్య ఖాతాలో ఎంత లేదన్నా ఇంకో 3 లేదా 4 హిట్స్ పడి ఉండేవని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఏ మూవీకి కమిట్ అవలేదు. కానీ అఖండ 2వ పార్ట్ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. దీని గురించి క్లారిటీ రావల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…