Divi : రెచ్చిపోయిన దివి.. లిప్‌లాక్‌లు, హ‌గ్‌లు చూసి అంతా షాక్..

December 7, 2021 10:39 AM

Divi : బిగ్ బాస్ 4వ సీజ‌న్‌లో పాల్గొని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దివి. అందం, ప్ర‌తిభ క‌ల‌గ‌లిపిన ఈ చిన్న‌ది ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటోంది. మోడ‌ల్‌గా కెరీర్ మెదలుపెట్టి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ రచ్చ చేస్తోంది. ఇటీవ‌ల మోస్ట్ డిజైర‌బుల్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఇక‌ సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్న‌ది అప్పుడ‌ప్పుడూ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

Divi  bigg boss fame sensational web series promo viral

తాజాగా దివి న‌యీం డైరీస్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించింది. ఇందులో దివి రొమాన్స్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారితో లిప్‌లాక్‌లు, దారుణ‌మైన రొమాన్స్, హ‌గ్‌లు.. బాబోయ్ ఇంత అరాచ‌కాన్ని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌స్తుతం దివికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథతో ‘నయీం డైరీస్‌’ తెర‌కెక్కింది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

దాము బాలాజీ దర్శకత్వం వహించారు. వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. నయీం అనే గ్యాంగ్‌స్టర్‌ తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులన్నీ ఇందులో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాన‌ని ద‌ర్శ‌కుడు అంటున్నారు.

నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి అని అంటున్నారు.. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. యజ్ఞశెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశికుమార్‌ తదితరులు చిత్రంలో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment