Devil Movie OTT Platform : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగాను మంచి జోష్ మీదున్నాడు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మంచి సక్సెస్ సాధించగా, ఆ తర్వాత వచ్చిన అమిగోస్ అంతగా అలరించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. డెవిల్ సెటప్, బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నేడు విడుదలైన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. కల్యాణ్ రామ్ యాక్టింగ్‍కు మంచి మార్కులు పడుతున్నాయి. కాగా, డెవిల్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్, శాటిలైట్ హక్కుల సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకే ఈ మూవీ హక్కులని దక్కించుకుందని తెలుస్తోంది.
థియేట్రికల్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డెవిల్ చిత్రం 2024 ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ హక్కుల డీల్ కూడా పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది.. ఈ చిత్రం శాలిలైట్ రైట్స్‌ను ఈటీవీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ ఛానెల్‍లో ఈ చిత్రం ప్రసారం కానుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా మూవీని నిర్మించడమే కాక దర్శకుడిగానూ ఆయనే వ్యవహరించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్కువ భాగం తానే డైరెక్షన్ చేశానని నవీన్ మేడారం చెప్పడం కాస్త వివాదమైంది.
డెవిల్’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో.. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి. మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సోనెబ్లిక్, ఎల్నాజ్ నోరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సీతా సత్య కీలకపాత్రలు పోషించారు.డెవిల్ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ వ్యవహరించారు. చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‍గా కనిపించి సందడి చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…