వినోదం

Deepavali Movie OTT Release : ఓటీటీలోకి దీపావ‌ళి చిత్రం.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ కానుందంటే..!

Deepavali Movie OTT Release : కొన్ని సినిమాలలో స్టార్లు హీరోలు నటించక‌పోయిన‌, భారీ బడ్జెట్లు పెట్ట‌క‌పోయిన‌.. పేరున్న దర్శకులు అవసరం లేక‌పోయిన‌.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు.. కటౌట్ నిలబడి పోతుంది. అలాంటి సినిమానే దీపావళి. రా వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా న‌వంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది. రియ‌లిస్టిక్ ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కిన దీపావ‌ళి సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రానికి ప‌లు ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డులు కూడా ద‌క్కాయి. డిసెంబ‌ర్ 15 నుంచి ఆహా ఓటీటీలో దీపావ‌ళి మూవీ స్ట్రీమింగ్ కానుంది.

త‌మిళంలో కిడా పేరుతో రిలీజైన ఈ చిత్రం ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో ఇండియ‌న్ ప‌నోర‌మ విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. మెల్‌బోర్న్‌, జాగ‌ర‌ణ్‌తో పాటు ప‌లు ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల‌ను గెలుచుకొని అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ , శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కు తెలుగు డబ్బింగ్ మూవీ ఇది. తమిళంలో రవికిషోర్ నటించిన కిడ కు తెలుగు అనువాదంగా దీపావళిని రూపొందించారు. చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. శీనయ్య అనే పెద్దాయన ఓ గ్రామంలో ఉంటాడు..ఆయన కూతురు, అల్లుడు అల్లుడు ప్రమాదంలో మరణిస్తారు. అప్పటి నుంచి మనవడు గణేష్ ని అల్లారు ముద్దుగా ఆ పెద్దవాళ్లు పెంచుకుంటారు.

Deepavali Movie OTT Release

మనవడు అంటే ప్రేమ ఉన్నప్పటికీ..చాలా పేద కుటుంబం కావడంతో అడిగినది కొని ఇవ్వలేని పరిస్థితి శీనయ్యకి ఏర్ప‌డుతుంది. అయితే దీపావ‌ళి పండక్కి మనవడు కొత్త డ్రస్ కొని ఇవ్వమని అడుగ‌గా, ఎలాగైనా సరే డ్రస్ కొనాలి ని, తన మనవడి కోరిక తీర్చాలని బంధుమిత్రులను బ్రతిమలాడగా.. ఎక్కడా డబ్బు పుట్టదు. సరిగ్గా అదేటైమ్ లో .. దేవుడికి మోక్కిన మేకను అమ్మేయాలని నిర్ణియించుకుంటాడు. అయితే దేవుడి మేక కావడంతో.. ఎవరూ కొనరు.ఓ వ్య‌క్తి మాత్రం కొన‌డానికి వ‌చ్చిన‌, అదే స‌మ‌యంలో మేక తప్పించుకుంటుంది. మ‌రి ఆ త‌ర్వాత మేక దొరికిందా.. సీన‌య్య ప‌రిస్థితులు మారాయా అనేది మిగ‌తా క‌థ‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM