Comedian Raghu : మ‌ద్యం అమ్ముతున్న క‌మెడియ‌న్ ర‌ఘు.. ఇది సినిమాలో కాదు, నిజ‌మే..!

December 2, 2021 1:40 PM

Comedian Raghu : బాగా బ్ర‌తికిన వాళ్లు ఒక్కోసారి పొట్టకూటి కోసం చిన్న చిన్న‌ వ్యాపారాలు చేసుకోవ‌ల్సి ఉంటుంది. టాలీవుడ్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు తాజాగా లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. సినిమాల్లో విలన్, కమెడియన్ పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ర‌ఘు. జబర్దస్త్ షోలోనూ కనిపించాడు. మధ్యలో అలీతో జాలీగా అనే షోలోనూ రచ్చ చేశాడు. అయితే రఘుకి ఇప్పుడు ఆఫ‌ర్స్ త‌క్కువే వ‌స్తున్నాయి.

Comedian Raghu selling liquor in shop

ఈ క్ర‌మంలో ఆయన మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మద్యం దుకాణాల కేటాయింపునకు ఇటీవల నిర్వహించిన లక్కీడ్రాలో ఆయన రెండు వైన్‌ షాపులను సొంతం చేసుకున్నారు. నల్లగొండ పట్టణ శివారు చర్లపల్లి వద్ద మర్రిగూడ బైపాస్‌లో తనకు దక్కిన షాప్‌లో రఘు.. స్వయంగా మద్యం సీసాలను సర్దారు. పూజలు చేశారు. కౌంటర్‌ వద్ద ఉండి మద్యాన్ని విక్రయించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

లాక్‌డౌన్ వల్ల ఏం చేయాలో అర్థం కాక.. ఇంటి చుట్టూ కూరగాయలు పెట్టాడట. ఆర్గానిక్‌గా పండించాడట. చాలా మంచిగా పండాయట. ఇదేదో బాగుందని పది ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ ఇప్పుడు పండిస్తున్నాడట. ఇంతలోనే తన ఫ్రెండ్స్ వైన్ షాపులకు టెండర్ పడుతుందట వేద్దామని అన్నారు. సరే ఇందులో కూడా మన లక్ ఎలా ఉందో అని ట్రై చేశాం. నాలుగింటికి వేస్తే రెండు దుకాణాలు నాకే వచ్చాయి అంటూ రఘు చెప్పుకొచ్చాడు. మొత్తానికి ర‌ఘుకు సినిమాల ప‌రంగా ఆఫ‌ర్స్ రాక‌పోయినా.. ఈ విధంగా అదృష్టం క‌ల‌సి వస్తోంద‌న్న‌మాట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment