వినోదం

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 సూప‌ర్ హిట్ మూవీలు ఇవే..!

Chiranjeevi : హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్‌, మ‌రికొన్ని సినిమాలు డిజాస్ట‌ర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. ఒక సినిమా సెట్స్ మీద ఉంది. మిగ‌తా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం.

మొదటగా మ‌న్నెంలో మొన‌గాడు సినిమాను చిరంజీవి వ‌దులుకున్నారు. ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను చిరంజీవితో చేయాల‌నుకున్నాడు. కానీ అప్ప‌టికే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావ‌డంతో ఆ పాత్ర త‌న‌కు సూట్ అవ్వ‌ద‌ని రిజెక్ట్ చేశాడు. అది యాక్ష‌న్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూప‌ర్ హిట్ అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి -శ్రీ‌దేవిల క్రేజీ కాంబినేష‌న్ లో ఒక సినిమాను వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ నిర్మిద్దామ‌ని అనుకున్నారు. శ్రీ‌దేవి పాత్ర ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు త‌ను కూడా పుల్ బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా వ‌దులుకున్నారు చిరు. త‌రువాత అది నాగార్జున చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించారు.

Chiranjeevi

అసెంబ్లీ రౌడీ సినిమాని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేద్దామ‌నుకున్నారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా చిరంజీవిని న‌టింప‌జేయాల‌ని అనుకున్నారు. కానీ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌ద‌నో, లేక త‌న డేట్స్ ఖాళీగా లేక‌నో చిరంజీవి ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించాడు. ఆ త‌రువాత అది మోహ‌న్ బాబుని వ‌రించి ఆయ‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. ఎస్వీ కృష్ణారెడ్డి నంబ‌ర్ వ‌న్‌ టైటిల్ తో మూవీని చిరంజీవితో చేద్దామ‌నుకున్నారు. అయితే అప్ప‌టికే కృష్ణారెడ్డి అన్నీ చిన్న సినిమాలు చేసి ఉండ‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కం లేక ఈ సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేశారు. ఇక ఆ సినిమా కృష్ణ కెరీర్ ని మ‌లుపు తిప్పి సూప‌ర్ హిట్ అయింది.

జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి అంత భారీగా సాహ‌స‌వీరుడు సాగ‌ర క‌న్య సినిమాని చిరంజీవి-మాధురి దీక్షిత్‌ల‌తో చేయాల‌నుకున్నారు కే రాఘ‌వేంద‌ర్‌రావు. అయితే వ‌రుస సినిమాలు ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో ఈ రిస్కీ ప్రాజెక్ట్‌ని అటెంప్ట్ చేయ‌డానికి చిరంజీవి ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో ఈ సినిమాను వెంక‌టేష్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కోస‌మే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రాసుకున్న స్క్రిప్ట్ ఆంధ్రావాలా. కానీ ఈ స్క్రిప్ట్ న‌చ్చ‌క మెగాస్టార్ దీనిని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా న‌టించాడు. చిరంజీవి అనుకున్న‌ట్టే ఈ సినిమా ఫ్లాప్ అయింది.

క‌న్న‌డ‌లో ఆప్త‌మిత్రుడు చూశాక అది తెలుగులో చిరంజీవికి సూట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు వీ.ఎన్‌.ఆదిత్య చిరుని చంద్ర‌ముఖి కోసం అడిగారు. ఈ సినిమాని త‌రువాత చేద్దామ‌ని చిరు దాట‌వేశారు. ఇక ఆ త‌రువాత ఆ సినిమా ర‌జినీకాంత్‌తో రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. తొలుత ఈ సినిమా కోసం చిరంజీవిని సంప్ర‌దించారు. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు. దీంతో ఈ మూవీ ర‌వితేజ చేతిలోకి వెళ్లింది. అయితే ఈ మూవీ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM