Chinna OTT Release Date : బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన సిద్ధార్థ్ ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించాడు. అయితే సిద్ధార్థ్ కి తమిళంలోనే కాకుండా తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ‘చిత్త’గా విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ని తెలుగులో చిన్నాగా విడుదల చేశారు. ఎమోషనల్ మూవీగా ఈ సినిమా అందరి ప్రశంసలు దక్కించుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ అందిపుచ్చుకోవడం లేదు. ఈ చిత్రాన్ని సిద్దార్థ్ స్వయంగా నిర్మించడం విశేషం. టైట్ స్క్రీన్ ప్లే తో, ఎమోషనల్ కంటెంట్ తో కథని నడిపిచినా జనాలను రీచ్ కాలేదు. చైల్డ్ అబ్యూజింగ్, హరాజ్మెంట్, చైల్డ్ రేప్ కేసెస్.. ఇలాంటి కంటెంట్ ని చూపించడంతో తెలుగువారికి ఈ చిత్రం పెద్దగా ఎక్కలేదు.
సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్తా చిత్రంలో నిమిషా సజయన్ కథానాయికగా నటించింది. సేతుపతి సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను చిన్నా అనే పేరుతో తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయగా.. కొన్ని రోజుల పాటు ఈ మూవీ థియేటర్‌లో తెగ సందడి చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన లేదు.నవంబర్ 17 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారని చెబుతున్నారు.
రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే చిత్రంగా రూపొందింది.. సడన్‌గా తన కూతురు కిడ్నాప్ అవ్వగా.. కూతురు కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది. కాగా చిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని, తెలుగు వెర్షన్ హక్కులను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చాలా ఫీలయ్యారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…