Bigg Boss 5 : ఈ సారి ఫినాలే మోతమోగిపోవ‌డం ఖాయం.. గెస్ట్‌లుగా దీపికా పదుకునే, ఆలియాభట్‌..?

December 14, 2021 11:48 AM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సీజ‌న్‌కి కేవ‌లం ఒక వారం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ వారం హౌజ్‌మేట్స్ ఫుల్ చిల్ కానున్నారు. అయితే ప్ర‌స్తుతం హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ముందుగా శ్రీరామ్ ఫినాలేకి చేరుకోగా, ఆ త‌ర్వాత స‌న్నీ, సిరి, ష‌ణ్ముఖ్, మాన‌స్ ఫినాలే చేరారు. ఎవ‌రు ఈ సీజ‌న్ విజేత అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Bigg Boss 5 grand finale deepika padukune alia bhatt may come as guests

మ‌రోవైపు బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలేకి గెస్ట్ లెవరనేది మరింత ఆసక్తి క్రియేట్‌ చేస్తోంది. గ‌త రెండు సీజ‌న్స్ లోనూ మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఎవరు గెస్టులుగా రాబోతున్నారనే విషయం సస్పెన్స్‌ గా మారిన నేపథ్యంలో పలు బిగ్‌స్టార్స్ పేర్లు వైరల్‌ అవుతుండటం విశేషం. డిసెంబర్‌ 19న జరుగనున్న గ్రాండ్‌ ఫినాలే లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ సందడి చేయబోతుందని, గెస్ట్ లుగా సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారనే వార్తలొచ్చాయి.

రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌తోపాటు బాలీవుడ్‌ స్టార్స్ దిగబోతున్నారని టాక్‌. `83` సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా గెస్ట్ లుగా రాబోతున్నారని అంటున్నారు. ఈ షోలో తమ సినిమాని ప్రమోట్‌ చేసుకోవాలని కూడా రణ్‌వీర్‌, దీపికా టీమ్‌ భావిస్తుందట. మరి ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.

కాగా.. సీజ‌న్ 5లో కొట్లాటలు, టాస్క్ లలో ఫైటింగ్‌లతో ఆద్యంతం షోని రక్తికట్టించిన సందర్బాలు చాలానే ఉన్నాయి. రేటింగ్‌ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మాత్రం ఈ ఐదో సీజన్‌ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment