Bigg Boss 5 : హౌజ్‌మేట్స్‌ని క‌డిగిప‌డేసిన మాజీ కంటెస్టెంట్స్.. క‌న్నీరు పెట్టుకున్న స‌న్నీ, మాన‌స్..

December 13, 2021 8:35 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ గేమ్ ఎండింగ్‌కి చేరుకుంది. కేవ‌లం ఒకే వారం మాత్ర‌మే మిగిలి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవ‌రో కూడా తేలిపోయింది. ఇక మిగిలింది, విజేత ఎవ‌ర‌నేది తేల్చ‌డ‌మే. సండే రోజు జ‌రిగిన ఎపిసోడ్‌లో నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ప‌లు గేమ్స్ ఆడించాడు. ఆస‌క్తిక‌రంగా ఈ గేమ్స్ సాగుతున్న క్ర‌మంలోనే సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా , మాన‌స్‌ని ఐదో ఫైన‌లిస్ట్‌గా ప్ర‌క‌టించి కాజ‌ల్ ఎలిమినేట్ అయిన‌ట్టు తెలియ‌జేశారు.

Bigg Boss 5 ex contestants questions to present ones sunny and manas cried

అయితే బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన కొంద‌రు కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌కి ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు. జెస్సీ మాట్లాడుతూ.. షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు ? అని ఎప్పుడైనా ఆలోచించావా ? అని అడిగాడు. దానికి ష‌ణ్ముఖ్‌.. ఫ్యామిలీస్‌ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్‌.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను అని అన్నాడు.

ఇక అనీ మాస్ట‌ర్.. సన్నీ, మానస్‌ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్‌ బిచింగ్‌ చేయలేదు. నువ్వు నా గుడ్‌ ఫ్రెండ్‌ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్‌ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని అని ప్ర‌శ్నించింది. దీనికి స‌న్నీ.. అది గేమ్ వ‌ర‌కే, మీరంటే నాకు చాలా అభిమానం ఉంద‌ని పేర్కొన్నాడు.

ఇక న‌ట‌రాజ్ మాస్ట‌ర్.. ఐస్‌ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్‌ నడవలేకపోయాడు. టికెట్‌ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్‌ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్‌పరంగా నీకు ప్లస్‌ అయిందా? మైనస్‌ అయిందా? అని అడిగాడు. దానికి శ్రీరామ్ ..ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100 శాతం ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్‌ అయింది.. అని అన్నాడు.

ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా ? నటించావా ? అని ప్రియాంక అడ‌గ‌గా, దానికి మానస్ కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు అని అన్నాడు. ఇలా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన త‌ర్వాత కాజ‌ల్ ఎలిమినేట్ అయిన‌ట్టు తెలియ‌జేశారు. స‌న్నీ, మాన‌స్ చాలా ఫీల్ అయ్యారు.

కాజ‌ల్ స్టేజ్ పైకి వ‌చ్చాక సన్నీ ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తే మానస్‌ ఐదు రెట్ల ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్‌ ఇస్తే, శ్రీరామ్‌ ఐదు రెట్ల యాక్షన్‌ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్‌ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్‌ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment