Balakrishna : ఈ మధ్య అల్లు ఫ్యామిలీతో బాలకృష్ణ చేస్తున్న సందడి మాములుగా లేదు. ఇటీవల బాలకృష్ణ అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా ఆ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. తమ అనుబంధం ఏనాటిదో అని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తన తాత అల్లు రామలింగయ్యకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఎన్టీఆర్ కిచెన్ లోకి అల్లు రామలింగయ్య నేరుగా వెళ్లిపోయేవారని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సీనియారిటీలో బాలయ్య నాకు తండ్రిలాంటి వారని తెలిపారు అల్లు అర్జున్.
తాజాగా బన్నీ.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశాడు. దీనికి సంబంధించి అఫిషియల్ ప్రకటన వచ్చింది. ఇది సినిమా రిలీజ్‌కి ముందే షూటింగ్ జరుపుకుంది. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఉండవలసి ఉంది. కానీ ‘పుష్ప’ టీమ్ కారణంగా మాస్ మహారాజ ఎపిసోడ్ ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ కానుందని, మరో వారానికి వాయిదా పడిందని సమాచారం.
ఏదేమైనా “అన్‌స్టాపబుల్” షోలో ఆశ్చర్యకరంగా రాజమౌళి, రవితేజ, అల్లు అర్జున్ వంటి ఊహించని అతిథులను తెరపైకి తీసుకు వస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. రాజమౌళితో కూడా బాలయ్య తెగ సందడి చేయగా, అల్లు అర్జున్ – బాలకృష్ణ టాక్ షోలో ఏయే విషయాల గురించి మాట్లాడుకుంటారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…