న‌ర్సుల‌పై త‌ప్పుడు కామెంట్స్‌.. స్పందించిన బాల‌కృష్ణ‌.. ఏమ‌న్నారంటే..?

February 7, 2023 11:12 AM

నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల ఎక్కువ‌గా వివాదాల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో దేవబ్రాహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడాడని, ఆ తరువాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించాడు అంటూ బాలకృష్ణ చుట్టూ వివాదాలు రాచుకున్నాయి. తాజాగా నర్సుల పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని కామెంట్ చేశాడు.

నర్సుల వివాదంపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. రోగులకు సేవలు అందించే నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని బాలకృష్ణ స్పష్టం చేశారు. ”బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

balakrishna responded on his recent comments about nurses

కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. దేవబ్రాహ్మణల వివాదంలో కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన బాలయ్య.. అక్కినేని వివాదంలో మాత్రం తాను క్షమాపణ చెప్పకుండా త‌న మాట‌ల‌ని స‌మ‌ర్ధించుకున్నాడు. ఈ క్ర‌మంలో బాల‌య్య మాత్రం వివాదాల‌తో తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now