Balakrishna : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సైన్స్‌ఫిక్షన్, భక్తిరసాత్మకం.. ఇన్ని జానర్లలో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆరేళ్లక్రితం హిస్టారికల్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించారు బాలయ్య. అయితే ట్రెండ్‌కి తగ్గట్టు బాలయ్య మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. బాలకృష్ణ ప్రస్తుతం పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలానే పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన బాలయ్య సీజన్ 3తో ఇప్పుడు సందడి చేస్తున్నాడు. దీనికి భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఇక బాలయ్య వేగ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతుండడంతో పాటు దానికి సంబంధించిన యాడ్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి బాలయ్య కి అందుతున్న రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్లు. ఇది కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అనే చెప్పాలి.
వరుస ప్రాజెక్ట్ లతో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న బాలయ్య ఇప్పుడు వరుస సక్సెస్‌లు సొంతం చేసుకుంటున్నాడు. అఖండ చిత్రం తర్వాత బాలయ్యకి ఒకటిని మించి మరొకటి అన్న విజయం దక్కింది. ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ చేస్తుండగా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.సుహాసిని, హరీష్ శంకర్, శ్రియ, జయంత్ సి పరాన్జీ గెస్ట్ లు హాజరైన ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…