Ashu Reddy : అషూ రెడ్డి ప్ర‌గ్నెంటా.. చీవాట్లు పెట్టిన త‌ల్లి..

December 8, 2021 3:53 PM

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా కొంత‌మందికి ద‌గ్గ‌రైన అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ పెంచుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ లైఫ్ లో ఏ విషయంపై అయినా ఓపెన్‌గా మాట్లాడటం అలవాటు చేసుకుంది. రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యక్తిగత విషయాలపై బోల్డ్ కామెంట్స్ చేసింది. తాజాగా త‌ను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఇంట్లోనే తన తల్లి ముందే ఓపెన్ అయింది.

Ashu Reddy become pregnant mother scolded her

తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లోకి ఎక్కాల‌నే ఆశ‌తో ఉండే అషూరెడ్డి.. తాజాగా ఒక ప్రాంక్ వీడియోను చేసింది. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించగా.. ‘‘నాకు పీరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. అయితే ఇదంతా జోక్ అని అనుకున్నారు. కానీ సీరియ‌స్‌గా ఏడుస్తుండడంతో త‌ల్లి నిజ‌మే అని న‌మ్మింది.

ఏం చేయమంటావు అమ్మా అని అషు అడగడం.. ఏదైనా తాగి చద్దాం. నిన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు.. అని అషు రెడ్డి తల్లి అన్నారు. ఆ తర్వాత కోపం తట్టుకోలేక ఆమె తల్లి అషుని కొట్టడం, కాలితో తన్నడం కూడా చేశారు. తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బతిమిలాడడం చూడొచ్చు. అషు రెడ్డి చివరకు ఇది ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పేసింది. ”నీకు ప్రాంక్‌లా ఉంది. నాకు హార్ట్ ఎటాక్‌లా ఉంది. ఇలాంటి విషయాలలో జోక్ చేస్తారా ?” అంటూ రెండు మొట్టికాయ‌లు అంటించింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment