Anchor Sowmya Rao : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ షో కి యాంకర్లుగా కేవలం రష్మి, అనసూయని మాత్రమే, మిగతా వాళ్ళని ఆ ప్లేస్ లో కనీసం ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు. అంతగా ఆ షో ని రక్తి కట్టించారు అనసూయ, రష్మి. అయితే అనుకోని కారణాల వలన వాళ్ళు ఇద్దరు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం వలన కొత్తగా ఆ స్థానంలోకి వచ్చింది కన్నడ నటి సౌమ్య రావు.ఈమె అనసూయ రేంజ్ లో ఆమె షో ని హ్యాండిల్ చేయగలదా అని అనుమానపడ్డారు. అయితే అందరి నమ్మకాలని వొమ్ము చేస్తూ తనదైన పంచులతో వచ్చిరాని తెలుగుతో షోని బాగానే నడిపించింది.
జబర్దస్త్ కమెడియన్ పంచులకి ఏమాత్రం తీసిపోని పంచులు వేస్తూ వాళ్లతో కలిసిపోయి తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే సడన్ గా ఈ మధ్య జబర్దస్త్ షోలో కనిపించకుండా పోయింది. ఎందుకో సడెన్ గా జబర్థస్త్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది సౌమ్య రావు. అయితే ఆమె తప్పుకుందా..? లేుక తప్పించారా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఏదో జరిగింది అన్నది మాత్రం వాస్తవం. సౌమ్య ప్లేస్లో ప్రస్తుతం జబర్థస్త్ ను బిగ్ బాస్ బ్యూటీ సిరీ హనుమంత్ యాంకరింగ్ చస్తోంది. ఈక్రమంతో తాను ఎందుకు జబర్థస్త్ ను వీడాను అనేదానిపై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఎందుకు జబర్దస్త్ షోను వదిలి వెళ్లారు? అని నెటిజన్ అడిగితే.. దానికి సౌమ్య ఇచ్చిన రిప్లై ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. టైం వస్తుంది.. అప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ అని చెప్పింది.
అయితే సౌమ్యరావు వచ్చాక యాంకరింగ్ చాలా సప్పగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అది రేటింగ్‌పై కూడా ఎఫెక్ట్ పడిందని, అందుకే ఆమెని తప్పించాల్సి వచ్చిందని అంటున్నారు. అనసూయ ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో ఉండేదని, కాని ఆమె వచ్చాక రేటింగ్ దారుణంగా పడిపోవడంతో తప్పని పరిస్థితులో మల్లెమాల వారు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…