Amigos Review : అమిగోస్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ ఖాతాలో మ‌రో హిట్ చేరిన‌ట్టేనా..?

February 10, 2023 11:13 AM

Amigos Review : డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న‌ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలం తరువాత బింబిసార సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అమిగోస్ అనే సరికొత్త సినిమాతో ఈరోజు(10 పిబ్రవరి) ఆడియన్స్ ముందుకు రాగా, ఈ సినిమాకి జోరుగా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మ‌మాలు చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. . సిద్ధార్థ్ అనే బిజినెస్ మెన్‌గా, మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ అనే ఇంజనీర్ పాత్రలో, మైకేల్ అనే గ్యాంగ్ స్టార్ గా మూడు సరికొత్త పాత్రల్లో కనిపించాడు నందమూరి హీరో. అసలు ఈ ముగ్గురి మధ్య రక్తసంబంధం ఉందా? లేక పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా? ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్ర అయిన మైకేల్, తనలా ఉండే ఆ ఇద్దరు పాత్రను ఎలా ఉపయోగించుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

‘అమిగోస్’లో కళ్యాణ్ రామ్ మూడు రోల్స్ చేయ‌గా, అందులో ఒకరు విలన్. ముందు మిగతా ఇద్దరితో స్నేహం చేసి… ఆ తర్వాత వాళ్ళను చంపాలని చూస్తారు. అయితే ‘అమిగోస్’లో ఆ విధంగా క్యూరియాసిటీ కలిగించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ప్రేమ కథ మరీ వీక్. హీరోయిన్ చెప్పే థియరీ రిపీట్ చేసి విసిగించారు. ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్ మొదలై, ఆసక్తిగా ఉంటుందని అనుకుంటే… అక్కడ సాగదీత సహనానికి పరీక్ష పెట్టింద‌నే చెప్పాలి. థియేటర్లలో ప్రేక్షకుడు క్యారెక్టర్లతో కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ లేవు. ఉన్నవి కూడా సోసోగా ఉన్నాయి.

Amigos Review kalyan ram latest movie how is it
Amigos Review

యాక్టింగ్ మ‌రియు యాటిట్యూడ్ పరంగా మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ వేరియేషన్ చూపించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్ పాత్రలో నటన, వాయిస్ మాడ్యులేషన్ ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. ఆషికా రంగనాథ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అమ్మాయి ముఖం కళగా ఉంది. కానీ, నటిగా తన ప్రతిభ చూపించే అవకాశం ఆమెకు రాలేదు అనే చెప్పాలి. జస్ట్ గ్లామర్ డాల్ రోల్ అంతే! బ్రహ్మాజీ, సప్తగిరికి నవ్వించే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించిన కూడా అనుకున్నంత హిట్ కాదు అని చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now