Allu Arjun : పెళ్లి చూపులు సినిమాతో మంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేసి అప్పట్లో ఘన విజయం సాధించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షుకులను కట్టిపడేసింది. అయితే ఈ కథ ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించారని ఫిల్మ్ నగర్లో అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిపోతాడని డైరక్టర్ సందీప్ రెడ్డి అనుకున్నారట. అందుకే ముందుగా ఆయనకు కథ వినిపించారని తెలిసింది.
అల్లు అర్జున్ కి కథ నచ్చినప్పటికీ.. కమర్షియల్ హీరోగా స్థిరపడుతున్న సమయంలో ప్రేమ కథలు చేయనని చెప్పినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు యువ హీరో శర్వానంద్ ని కూడా హీరోగా చేయమని డైరక్టర్ అడిగారట. ఆయన కూడా నో చెప్పారట. వీరిద్దరూ నో చెప్పడంతో ఈ కథ విజయ్ చేతికి చిక్కింది. అతని ఖాతాలో మరో హిట్ చేరింది.
ఇక అర్జున్ రెడ్డి మూవీని చేయకున్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆయన నటించిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ సైతం రిలీజ్ కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…