Allu Arjun Balakrishna : ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు ఎంత కీలక పాత్రలు పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోలు పలు సందర్భాలలో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అల్లు, నందమూరి ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. ఇటీవల బాలయ్య నటించిన అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ గెస్ట్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇక బాలకృష్ణ హోస్ట్‌గా అల్లు అరవింద్ అన్‌స్టాపబుల్ అనే షో చేస్తున్నారు. ఈ సందర్భాలలో ఒకరిపై తెగ ప్రేమ కురిపించుకున్నారు.
అల్లు కాంపౌండ్ లో ఒక ట్రెండ్ ని అల్లు అర్జున్ కొనసాగిస్తున్నాడు. మహానటి చిత్రం మంచి విజయం సాధించినప్పుడు బన్నీ టీం అందరికీ ప్రత్యేకమైన పార్టీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీనులతోపాటు అఖండ చిత్ర యూనిట్ కి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖండ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ పార్టీ ఏర్పాటు చేశారట. బాలయ్యకు పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా నందమూరి.. అల్లు కుటుంబాల మధ్య బంధం మరింతగా బలపడుతోందని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అల్లు ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి దగ్గరవుతున్న క్రమంలో మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి గురించి ఎక్కువగా మాట్లాడే బన్నీ పేరు ఎత్తడం లేదు. అదీ కాక అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి తరచూ వార్తలలోకి ఎక్కడం.. అనేక అనుమానాలను కలిగిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…