Allu Arjun Balakrishna : అల్లు ఫ్యామిలీకి ద‌గ్గ‌రవుతున్న బాల‌కృష్ణ‌.. బ‌న్నీ పార్టీ ఇవ్వ‌బోతున్నాడంటూ ప్రచారం..!

December 13, 2021 8:03 PM

Allu Arjun Balakrishna : ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మెగా, నంద‌మూరి, ద‌గ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు ఎంత కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోలు ప‌లు సంద‌ర్భాల‌లో క‌లిసి సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కులకి మంచి వినోదం అందిస్తున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో అల్లు, నంద‌మూరి ఫ్యామిలీ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాయి. ఇటీవ‌ల బాల‌య్య న‌టించిన అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ‌న్నీ గెస్ట్‌గా వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇక బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు అరవింద్ అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్నారు. ఈ సంద‌ర్భాల‌లో ఒకరిపై తెగ ప్రేమ కురిపించుకున్నారు.

Allu Arjun Balakrishna coming together making fans questionable

అల్లు కాంపౌండ్ లో ఒక ట్రెండ్ ని అల్లు అర్జున్ కొనసాగిస్తున్నాడు. మ‌హాన‌టి చిత్రం మంచి విజ‌యం సాధించిన‌ప్పుడు బ‌న్నీ టీం అంద‌రికీ ప్ర‌త్యేకమైన పార్టీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీనులతోపాటు అఖండ చిత్ర యూనిట్ కి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖండ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ పార్టీ ఏర్పాటు చేశారట. బాలయ్యకు పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా నందమూరి.. అల్లు కుటుంబాల మధ్య బంధం మరింతగా బలపడుతోందని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అల్లు ఫ్యామిలీ.. నంద‌మూరి ఫ్యామిలీకి ద‌గ్గ‌రవుతున్న క్ర‌మంలో మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ‌తంలో చిరంజీవి గురించి ఎక్కువ‌గా మాట్లాడే బ‌న్నీ పేరు ఎత్త‌డం లేదు. అదీ కాక అల్లు ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ క‌లిసి త‌ర‌చూ వార్త‌ల‌లోకి ఎక్క‌డం.. అనేక అనుమానాలను క‌లిగిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment