Aha Naa Pellanta 1987 Collections : కామెడీ మూవీస్ తో బాక్సాఫీస్ హిట్స్ కొట్టవచ్చని హాస్య బ్రహ్మ జంధ్యాల నిరూపించారు. అందుకు తార్కాణం అహ నా పెళ్ళంట సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని హాస్య రస చిత్రాలను ఆయన అందించారు. అహ నా పెళ్ళంట సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ టాప్ కి చేరగా.. బ్రహ్మానందం కెరీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోని విధంగా మారింది. ఆదివిష్ణు రాసిన పల్లకి వారపత్రికలో సత్యం గారి ఇల్లు సీరియల్ ని సినిమాగా తీయాలని అనుకుంటున్న సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ కామెడీ సినిమా చేసి పెట్టమని డాక్టర్ రామానాయుడు అడగడంతో వెంటనే జంధ్యాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
సురేష్ సంస్థలో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన జంధ్యాలకు అప్పుడు డైరెక్టర్ గా ఛాన్స్ రావడంతో ఆదివిష్ణు సీరియల్ కి ప్రేమ వంటివి కలిపి అహ నా పెళ్ళంట స్క్రిప్ట్ రెడీ చేశారు. హీరో రాజేంద్ర ప్రసాద్ ని అనుకోగా, హీరోయిన్ గా రజనిని సెలెక్ట్ చేశారు. హీరో తండ్రిగా నూతన ప్రసాద్ ను తీసుకున్నారు. పిసినారి లక్ష్మీపతి పాత్రకు రావుగోపాలరావుని అనుకున్నా చివరకు కోట శ్రీనివాసరావుని సెలెక్ట్ చేశారు. మొత్తం జంధ్యాల టీమ్ అందరూ చేరిపోయారు. విక్టరీ వెంకటేష్ కి తెలిసి తానే చేస్తానన్నాడట. అయితే ఇది రాజేంద్రప్రసాద్ కి కరెక్ట్ గా ఉంటుందని చెప్పడంతో 1987 జూలై 7న హైదరాబాద్ కి సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ స్టార్ట్ అయింది.
షూటింగ్ వేగంగా సాగిపోతుంటే లక్ష్మీపతి అసిస్టెంట్ పాత్రకు సెలెక్ట్ చేసిన సుత్తివేలు బిజీ అయిపోవడంతో సత్యాగ్రహం సినిమాలో చేసిన అత్తిలి లెక్చరర్ గుర్తొచ్చి అసోసియేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణను పిలిచి అత్తిలి లెక్చరర్ కి కబురు పంపించారు. లెక్చరర్ కనుక సూటు బూటుతో వచ్చాడు. అయితే బార్బర్ ని పిలిచి జంధ్యాల ఏదో చెప్పడంతో బ్రహ్మానందంను పక్కకు తీసుకెళ్లి 20 నిమిషాల తర్వాత తీసుకొస్తే అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు.
మద్రాసులో ప్రివ్యూ వేస్తే సైలెంట్ గా చూస్తూనే ఉండడంతో బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడు. బయట థియేటర్లలో రెస్పాన్స్ బాగానే వస్తుందని జంధ్యాల చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక జనం పగలబడి నవ్వుతూ చూశారు. రామానాయుడికి నవ్వుతోపాటు కాసుల వర్షం కురిపించింది. రూ.16 లక్షలతో ఈ సినిమా తీస్తే రూ.5 కోట్లు వచ్చాయి. జంధ్యాలకి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. రమేష్ నాయుడు సాంగ్స్ సూపర్ గా వచ్చాయి. బ్రహ్మానందంకి వరుస ఆఫర్స్ రావడం మొదలైంది. పిసినారి పాత్రలో కోట అదరగొట్టేశాడు. ఇక నూతన ప్రసాద్ యాక్షన్ అదుర్స్. ఇలా అన్నీ కలగలిపి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. దీంతో ఎంతో మందికి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ లా నిలిచిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…