Adikeshava OTT Rights : మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ.’ఉప్పెన’ వంటి బిగ్ సక్సెస్ తర్వాత వైష్ణవ్ తేజ్ పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అవి అతడికి మంచి విజయాన్ని అందించలేకపోయాయి. ఈ క్రమంలో మంచి హిట్ కొట్టాలనే కసితో ‘ఆదికేశవ’ అనే సినిమాను చేశాడు. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ డివోషనల్ టచ్‌తో రూపొందగా, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది.
‘ఆదికేశవ’ సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. తీవ్రమైన పోటీ నడుమ ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే, ఆదికేశవ శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.
ఆదికేశవ’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌కి గోల్డెన్ లెగ్‌గా మారగా, ఈ మూవీకి డివైడ్ టాక్ రావడంతో అమ్మడి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీన్లపై ట్రోల్స్ కూడా జోరుగా వస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…