Actress Rakshitha : ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

May 13, 2024 12:39 PM

Actress Rakshitha : హీరోలు చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. కానీ హీరోయిన్లు అలా కాదు. హ‌వా ఉన్నంత కాలం మాత్ర‌మే ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతారు. ఒక్క‌సారి ఫ్లాపుల ప‌ర్వం మొద‌లై అవ‌కాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయితే ఇక అంతే సంగ‌తులు. అలాంటి హీరోయిన్లు చాలా త‌క్కువ కాలంలోనే తెర‌మ‌రుగు అయిపోతారు. ఇక ఇండ‌స్ట్రీలో అలాంటి వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు చెప్ప‌బోయే హీరోయిన్ కూడా ఆమెనే. ఇంత‌కీ ఆమెను గుర్తు ప‌ట్టారా.. లేదా.. అదేనండీ.. ఆమెనే.. హీరోయిన్ ర‌క్షిత‌. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో ఈమె న‌టించింది. కానీ త‌రువాత ఇండ‌స్ట్రీకి దూరం అయింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే ఇప్పుడు ఆమెను చూసిన అంద‌రూ షాక‌వుతున్నారు. అంత‌లా ఆమె మారిపోయింది.

ర‌క్షిత ఒక‌ప్పుడు సినిమాల్లో త‌న అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌తో ఒక ఊపు ఊపేసింది. తెలుగు, త‌మిళంలో స్టార్ హీరోల సినిమాల్లో న‌టించింది. తెలుగులో ఆమె ఇడియ‌ట్ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసింది. దీంతో ఆమెకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌రువాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు కొట్టేసింది.

Actress Rakshitha latest photos viral on social media
Actress Rakshitha

మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ర‌క్షిత‌. అలాగే తమిళ్ లోనూ నటించింది. అక్కడ దళపతి విజయ్ లాంటి స్టార్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఇలా గుర్తుపట్టలేనంతగా మాదిరిపోయింది. బరువు పెరిగిపోయింది. నటనకు బ్రేక్ ఇచ్చిన ఈమె నిర్మాతగా సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకుంది. ఆతర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసింది. అలాగే టీవీ షోలు చేస్తుంది. అయితే తాజాగా ర‌క్షిత ఫొటోలు మ‌రోమారు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆమెను చూసిన అంద‌రూ ఒక‌ప్ప‌టి ర‌క్షితేనా ఈమె.. ఇంత‌లా మారిపోయింది.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now