Actress Hema : సినిమాలు మానేసి కొత్త బిజినెస్ మొద‌లు పెట్టిన న‌టి హేమ‌..అదేంటంటే..?

February 11, 2023 5:02 PM

Actress Hema : టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన వారిలో న‌టి హేమ ఒక‌రు. బ్ర‌హ్మానందంతో ఆమె కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ర‌క్తి క‌ట్టిస్తుంటాయి. ఒక‌ప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల రాజ‌కీయాలు, బిజినెస్‌లు అంటూ కొంత సినిమాలు త‌గ్గించింది. కాంట్ర‌వ‌ర్సీల‌తో కూడా వార్త‌లలో నిలుస్తూ ఉంటుంది హేమ‌. అడ‌పా ద‌డ‌పా కొన్ని ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. సన్నిహితుల‌ను క‌లుస్తున్నారు. కానీ సినిమాల్లో క‌నిపించ‌టం త‌క్కువైంది. రీసెంట్‌గా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు హోట‌ల్ కొత్త బ్రాంచీని మ‌ణికొండ‌లో ప్రారంభించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ స‌హా ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో న‌టి హేమ కూడా అక్క‌డ‌కు వ‌చ్చారు.

ఇటీవ‌ల సినిమాల‌లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదేంటి అని ప్ర‌శ్నించ‌గా,దానికి స్పందించిన హేమ‌.. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాద‌న ఎక్కువై పోయి, సుఖ ప‌డ‌టం ఎక్కువ అల‌వాటు అయిపోయి, క‌ష్ట‌ప‌డ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదంతే అంటూ కాస్త సెటైరిక‌ల్‌గా మాట్లాడింది. అయితే కొంద‌రు ఆమె నిజంగానే బిజినెస్‌లు చేస్తూ బిజీగా ఉంద‌ని అంటున్నారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? అని సదరు యాంక‌ర్ ఇదే ప్ర‌శ్న వేస్తే … ఆమె స‌మాధానం ఇవ్వ‌లేదు. మ‌రో ఇంట‌ర్వ్యూలో చెబుతానంటూ దాట‌వేసింది. 56 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న హేమ‌…రోజుకి ఈమె రూ.1.5 నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు అటు ఇటుగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంది.

Actress Hema said she started a new business
Actress Hema

ప్ర‌స్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో హేమ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కూడా సరైన పాత్రలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఆ మ‌ధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌కు స‌పోర్ట్‌గా హేమ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. త‌ర్వాత ఎందుక‌నో హేమ మీడియా ముందుకు రావ‌టం కూడా మానేసింది. సినిమాల్లోనూ పెద్ద‌గా క‌నిపించ‌టం లేదు. రానున్న రోజుల‌లో ఆమె కూతురిని కూడా సినిమాల‌లోకి తీసుకు వ‌స్తుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now