వినోదం

Actor Shivaji : వ‌య‌స్సు ప్ర‌భావం వ‌ల్ల‌నే అలా.. ప్ర‌శాంత్ అరెస్ట్‌పై శివాజి రియాక్ష‌న్..

Actor Shivaji : ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్ 7 ఉల్టా పుల్టా అంటూ అందరిలో అనేక అంచ‌నాలు పెంచింది. ఇక అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే షో సాగింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా ప్ర‌శాంత్ నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ జరిగిన తర్వాత పోలీసుల మాటను పట్టించుకోకుండా ఫ్యాన్స్ తో ర్యాలీ చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టానికి కారణమయ్యాడని పల్లవి ప్రశాంత్ మీద పలు రకాల సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. ఆయ‌న అరెస్ట్ త‌ర్వాత కొంద‌రు త‌ప్ప ముఖ్య‌మైన వారు ఎవ‌రు కూడా స్పందించ‌లేదు. ముఖ్యంగా హౌస్ లో నా బిడ్డ పల్లవి ప్రశాంత్ అనుకుంటూ వచ్చిన శివాజి ఈ అరెస్ట్ వ్యవహరంపై స్పందించ‌క‌పోవ‌డంతో నెటిజ‌న్స్ సోష‌ళ్ మీడియాలో ర‌చ్చ చేశారు.

ఈ క్ర‌మంలో శివాజీ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘అందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలు ఒక హౌస్‌లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కుర్రాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయొచ్చు. నేను ప్రశాంత్ గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకూ ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి సమాచారం నా దగ్గర ఉంది. కాబట్టి నేను ప్రతీది ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని వివరించాడు.

Actor Shivaji

చట్టం తన పని తాను చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్ కి ఏమి అవ్వదు. తనకు నేనున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజి. శివాజి స్పందించడం లేట్ అయ్యేసరికి పల్లవి ప్రశాంత్ తో అతని స్నేహం అంతా హౌస్ లోనేనా బయటకు వచ్చాక జరిగిన విషయాల మీద శివాజి ఎందుకు స్పందించలేదని కొందరు కామెంట్ చేశారు. దానికి వివరణ ఇస్తూ పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ తో తను మాట్లాడుతున్నానని మీ అందరికీ తెలిసేలా నేను కనిపించాలని లేదని అన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక జట్టుగా ఆట ఆడారు. వీరు ముగ్గురు టాప్ 5లో నిలిచారు. పల్లవి ప్రశాంత్ సీజన్ విన్నర్ గా టైటిల్ గెలవగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. శివాజి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఈ సారే అలా జ‌ర‌గ‌డం ప‌ట్ల కొంత విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM