ఉద్యోగ అవ‌కాశం.. అమెజాన్‌లో రోజూ 4 గంట‌లు ప‌నిచేస్తే నెల‌కు రూ.60వేలు సంపాదించే అవ‌కాశం.. ఎలాగో తెలుసుకోండి..!

July 19, 2021 12:00 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.55వేల నుంచి రూ.60వేల వ‌ర‌కు సంపాదించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఇందుకు గాను అమెజాన్‌లో డెలివ‌రీ బాయ్ గా ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు గాను రోజూ 100 నుంచి 150 ప్యాకేజీల‌ను డెలివ‌రీ చేయాల్సి ఉంటుంది. వేర్ హౌజ్ నుంచి 10-15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న వారికి వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేయాలి.

with amazon you can earn rs 60000 per month here it is how to do it

ఇక ఈ ఉద్యోగానికి గాను రోజుకు కేవ‌లం 4-5 గంట‌ల పాటు ప‌నిచేస్తే చాలు. ఉద‌యం 7 నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య ఎప్పుడైనా డెలివ‌రీలు చేయ‌వ‌చ్చు. టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ ఏది చ‌దివినా స‌రే ఈ జాబ్ చేయ‌వ‌చ్చు. సొంత వాహ‌నం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ను క‌లిగి ఉండాలి.

డెలివ‌రీ బాయ్‌ల‌కు అమెజాన్ నెల‌కు రూ.12000 నుంచి రూ.15000 వ‌రకు ఫిక్స్‌డ్ వేత‌నం ఇస్తుంది. అయితే ఒక్క ప్యాకేజీని డెలివ‌రీ చేస్తే రూ.10 నుంచి రూ.15 వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో రోజుకు 150 ప్యాకేజీల‌ను డెలివ‌రీ చేస్తే రూ.10 చొప్పున అవే రూ.1500 అవుతాయి. ఇవి నెల‌కు రూ.45వేలు అవుతాయి. దీనికి శాల‌రీ క‌లిపితే రూ.60వేలు అవుతాయి. అందువ‌ల్ల ఆ మొత్తంలో సంపాదించుకునేందుకు వీలు క‌లుగుతుంది.

ఆసక్తి ఉన్న వారు త‌మ‌కు స‌మీపంలోని అమెజాన్ వేర్ హౌజ్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు. అలాగే https://logistics.amazon.in/applynow అనే సైట్‌ను సంద‌ర్శించి కూడా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now