SBI లో 6100 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు!

July 18, 2021 7:25 PM

నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెబుతోంది. స్టేట్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 పోస్టులు ఖాళీగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి అప్రెంటిస్ యాక్ట్1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2020 ఆగస్టు 31 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300ల పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ప్రతి నెల 15 వేల రూపాయలను స్టయిఫండ్ ఇవ్వనున్నారు. జులై 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 26 2021 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ. ఆగస్టు నెలలో ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ https://bank.sbi/web/careers వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now