పదో తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.!

September 3, 2021 5:33 PM

నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ నేవీ శుభవార్తను తెలియజేసింది. నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డులో ఖాళీగా ఉన్న 302 ట్రేడ్ మెన్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిసిగ్నేటెడ్‌ ట్రేడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి యాభై రోజుల లోపు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత ట్రేడ్ లో
ఐటీఐ ఉత్తీర్ణత, నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ చేసి ఉండాలి. వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌ సైట్‌ https://www.indiannavy.nic.in/  ను సంప్రదించాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింద తెలిపిన చిరునామాకు దరఖాస్తులను పంపించాలి.

THE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL), NAVAL SHIP REPAIR YARD (PBR), POST BOX NO. 705, HADDO, PORT BLAIR – 744102, SOUTH ANDAMAN.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment