నిరుద్యోగులకు శుభవార్త.. ఈసీఐఎల్‌ లో ఆర్టిజన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

September 14, 2021 1:29 PM

నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్తను తెలిపింది. ఈసీఐఎల్‌ లో ఖాళీగా ఉన్న ఆర్టిజన్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం ఖాళీగా ఉన్న 40 పోస్టులను భర్తీ చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

నిరుద్యోగులకు శుభవార్త.. ఈసీఐఎల్‌ లో ఆర్టిజన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫిట్టర్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అసెంబ్లీ ఆఫ్‌ మెకానికల్, ప్రెసిషన్‌ మెకానికల్‌ పని అనుభవం ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 31.08.2021 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు మైసూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.18,564 వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 17 2021. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు  www.gailonline.com అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment