ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)లో రాణించాల‌నుకునే వారికి అందుబాటులో ఉన్న కోర్సులు..!!

March 29, 2021 2:41 PM

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ప్ర‌స్తుత త‌రుణంలో అనేక రంగాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఈ రంగంలో ఉద్యోగావ‌కాశాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని గ‌మ‌నించిన చాలా మంది ఏఐలో నైపుణ్య‌త‌ను సాధించి ఉద్యోగాల‌ను పొందుతున్నారు. అయితే ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌ముఖ ఇనిస్టిట్యూట్‌లు ఏఐ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సుల‌లో చేర‌డం ద్వారా నూత‌న మెళ‌కువ‌ల‌ను నేర్చుకుని ఉద్యోగావ‌కాశాల‌ను మెరుగు ప‌రుచుకోవచ్చు.

courses in artificial intelligence offered by famous institutes

Digital Transformation Using AI/ML with Google Could Specialization

ఈ కోర్సును గూగుల్ క్లౌడ్ అందిస్తోంది. ఇది బిగిన‌ర్ లెవ‌ల్ కోర్సు. వారానికి 5 గంట‌లు క్లాసులు ఉంటాయి. 2 నెల‌ల కాల‌వ్య‌వ‌ధిలో కోర్సును పూర్తి చేయాలి. అయితే ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు షెడ్యూల్‌, డెడ్‌లైన్ పెట్టుకుని ఈ కోర్సును పూర్తి చేయ‌వ‌చ్చు. కోర్స్ పూర్తి చేసిన వారికి స‌ర్టిఫికెట్ ల‌భిస్తుంది. ఈ కోర్సులో ఆస‌క్తి ఉన్న ఎవ‌రైనా చేర‌వ‌చ్చు.

AI and Machine Learning MasterTrack Certificate

Coursera అనే వెబ్‌సైట్ ద్వారా అరిజోనా స్టేట్ యూనివ‌ర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. మే 17న కొత్త సెష‌న్లు ప్రారంభం అవుతాయి. 6-9 నెల‌ల పాటు స‌మ‌యం ప‌డుతుంది. ఇంట‌ర్మీడియ‌ట్ లెవ‌ల్ ఉన్న వారికి ఈ కోర్సు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అభ్య‌ర్థులు 4500 డాల‌ర్ల ఫీజు చెల్లించి కోర్సులో చేర‌వ‌చ్చు.

Artificial Intelligence: Knowledge Representation and Reasoning

ఐఐటీ మ‌ద్రాస్ ఈ కోర్సును అందిస్తోంది. 12 వారాల వ్య‌వ‌ధి ఉన్న కోర్సు ఇది. యూజీ, పీజీ విద్యార్థులు ఇందులో చేర‌వ‌చ్చు. కోర్సు చివ‌ర్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అందులో పాస్ కావాలంటే 12 అసైన్‌మెంట్ల‌లో క‌నీసం 8 అసైన్‌మెంట్ల‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Computer Science Artificial Intelligence

హార్వార్డ్ యూనివ‌ర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 12 వారాలు. వారానికి 6 నుంచి 18 గంట‌ల క్లాసులు ఉంటాయి. కోర్సులో కొన్ని రోజుల పాటు వారానికి 10 నుంచి 30 గంట‌ల పాటు క్లాసుల‌ను నిర్వ‌హిస్తారు. ఎడ్ఎక్స్ లో కోర్సును అభ్యసించాల్సి ఉంటుంది. ఫీజు రూ.25,998.

IBM Applied AI professional certificate

ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 7 నెల‌లు. దీన్ని కోర్స్ ఎరా ద్వారా ఐబీఎం అందిస్తోంది. కోర్సును పూర్తి చేసిన వారికి ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్, ఐబీఎం డిజిట‌ల్ బ్యాడ్జ్‌‌ను ఇస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment