డిగ్రీ పాసైన విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇండియన్ ఆర్మీలోని టెరిటోరియల్ ఆర్మీలో ఈ పోస్టులున్నాయని, ఈ పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి జులై 20న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 19 వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలోనే ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వీరు వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వందల రూపాయల పరీక్ష రుసుము చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది.
https://www.jointerritorialarmy.gov.in/
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…