ఏపీ ట్రాన్స్ కో లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

August 4, 2021 7:00 PM

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 16 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సీఏ/సీఎంఏ అభ్యర్థులు అర్హులు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరితేదీ ఆగస్టు 10.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
https://aptransco.co.in/

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 2021 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి గడువు ఆగస్టు 10. అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా…Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada – 520 004 ఈ అడ్రస్ కి పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment