ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 3,393 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

July 27, 2021 11:46 AM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా గత నెలలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నవంబర్ నెలలో పలు ఉద్యోగాల భర్తీకి విడుదల చేయనున్న నోటిఫికేషన్ ఆగస్టు నెలలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.జాబ్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో విడుదల కావాల్సినటువంటి మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (MLHP) ఉద్యోగాలను ఆగస్టు నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనుంది.

వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఉద్యోగాలను ముందుగానే భర్తీ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేయడానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి లభించడంతో ఖాళీగా ఉన్నటువంటి 3,393 MLHP ఉద్యోగాలను ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment