విద్య & ఉద్యోగం

FMCG సెక్టార్‌లో 5 అద్భుత‌మైన ఉద్యోగ అవ‌కాశాలు..!!

క‌రోనా వ‌ల్ల అనేక మంది ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారింది క‌నుక మ‌ళ్లీ కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు ఉద్యోగాలు, ఉపాధిని అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే క‌రోనా స‌మ‌యంలోనూ కొన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు, రంగాల‌కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అందువ‌ల్ల అలాంటి రంగాల్లో ఉద్యోగాల‌ను ఎంపిక చేసుకుంటే కెరీర్ నిశ్చింత‌గా ఉంటుంది. జాబ్ పోతుంద‌నే భ‌యం ఉండ‌దు. అలాంటి రంగాల్లో FMCG రంగం కూడా ఒక‌టి. దీన్నే Fast Moving Consumer Goods రంగం అని కూడా అంటారు. అంటే ప‌రిశ్రమ‌లు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువులకు కొంత కాల ప‌రిమితి ఉంటుంది క‌దా. ఆ తేదీ దాటితే అవి ఎక్స్‌పైర్ అవుతాయి. అందువ‌ల్ల స‌మ‌యంలోగానే వాటిని అమ్మాల్సి ఉంటుంది. దీంతో ఈ రంగానికి వినియోగ‌దారుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మ‌నం నిత్యం కొనే కిరాణా స‌రుకులు, కాస్మొటిక్స్ వంటివి ఈ కోవ‌కే చెందుతాయి. ఈ రంగంలో ఉద్యోగుల‌కు ముఖ్యంగా 5 ర‌కాల ఉద్యోగ అవ‌కాశాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే…

1. రిటెయిల్ బ‌య్య‌ర్స్

ఈ జాబ్‌లో ఉన్న‌వారు త‌మ కంపెనీల‌కు చెందిన స్టాక్‌ను ఎప్ప‌టికప్పుడు ప‌రిశీలిస్తుంటారు. వారు త‌మ క‌స్ట‌మ‌ర్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు, త‌మ వ‌ద్ద వారు ఏమేం కొంటున్నారు ? అనే వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాలి. అందుకు అనుగుణంగా ఉత్ప‌త్తుల‌ను తెచ్చి అందుబాటులో ఉంచాలి. ఇలా వీరు ప‌నిచేస్తారు. ఈ జాబ్ చేసే వారికి పుష్క‌లంగా అవ‌కాశాలు ఉంటాయి.

2. మార్కెటింగ్ మేనేజ‌ర్స్

వీరు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్కెటింగ్ ప్లాన్ల‌ను అమ‌లు చేయాలి. అమ్మ‌కాల‌ను పెంచాలి. క‌స్ట‌మ‌ర్లు కొనే వ‌స్తువుల ట్రెండ్‌ను ప‌రిశీలించాలి. నిర్దిష్ట‌మైన ప్రాంతంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప‌బ్లిసిటీ అయ్యేలా మార్కెటింగ్ ఎలా చేయాలి ? అన్న వివ‌రాల‌ను వీరు ఆలోచిస్తారు. వాటిని అమ‌లు చేసి కంపెనీల‌కు లాభాల‌ను తెచ్చి పెడ‌తారు.

3. స‌ప్లై చెయిన్ డిస్ట్రిబ్యూష‌న్ మేనేజ‌ర్స్

త‌గిన స్టోర్‌కు స‌రైన ఉత్ప‌త్తుల‌ను స‌కాలంలో చేర‌వేయ‌డం వీరి ప‌ని. వీరు రిటెయిల్ ఔట్‌లెట్ల‌కు అన్ని ర‌కాల వ‌స్తువులు స‌కాలంలో స‌ర‌ఫ‌రా అవుతున్నాయా ? లేదా ? స‌ప్లై ఎలా ఉంది ? అనే వివ‌రాల‌ను ప‌రిశీలించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రుకుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తారు. ఇది చ‌క్క‌ని అవ‌కాశాలు ఉన్న జాబ్ అని చెప్ప‌వ‌చ్చు.

4. ఫైనాన్స్ మేనేజ‌ర్స్

ఎంబీఏ చేసిన వారు సాధార‌ణంగా ఈ జాబ్ చేస్తారు. వీరు అన్ని ర‌కాల కాస్ట్ సేవింగ్ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ కంపెనీల‌కు ఖ‌ర్చుల‌ను త‌గ్గిస్తూ ఆదాయాన్ని పెంచుతారు. ఇది కూడా చ‌క్క‌ని జాబ్‌. ఇందులోనూ ఉద్యోగుల‌కు ఎంతో వృద్ధి ఉంటుంది.

5. రిటెయిల్ మేనేజ‌ర్స్

వీరు అన్ని రిటెయిల్ ఔట్‌లెట్ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. క్వాలిటీ ఉన్న క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సేవ‌ల‌ను అందిస్తారు. ఇన్వెంట‌రీని మేనేజ్ చేస్తారు. ఫైనాన్స్‌ను చూస్తారు. రిటెయిల్ స్టోర్ సైజ్‌ను బ‌ట్టి వీరు చేసే ఉద్యోగం మారుతుంది. కొన్ని సార్లు వీరు స‌ప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌, రిటెయిల్ స‌ప్లై మేనేజ్‌మెంట్‌, స్టాక్ సెలెక్ష‌న్ వంటి ప‌నులు చేయాల్సి వస్తుంది. అయిన‌ప్ప‌టికీ ఇది కూడా చ‌క్క‌ని ఉద్యోగం అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM