దారుణంగా మారుతున్న ప‌రిస్థితులు.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ త‌ప్ప‌దా..?

May 7, 2021 3:31 PM

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎంత దారుణంగా ఉందో అంద‌రికీ తెలిసిందే. రోజుకు 4 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి. 3వేల మందికి పైగా చ‌నిపోతున్నారు. రాను రాను ప‌రిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయ‌ని, కోవిడ్ సెకండ్ వేవ్ త్వ‌ర‌లో పీక్ ద‌శ‌కు చేరుకుంటుంద‌ని, త‌రువాత కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కూడా వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది.

Worse changing circumstances .. Is there a lockdown across the country ..?

అయితే ప్ర‌ధాని మోదీ దేశంలో లాక్‌డౌన్‌ను పెట్టేది లేద‌ని, ఆ విష‌యాన్ని రాష్ట్రాల‌కే వ‌దిలేశామ‌ని అన్నారు. లాక‌డౌన్ అనేది చివ‌రి అస్త్ర‌మ‌ని, దాన్ని ప్ర‌యోగించే వ‌ర‌కు ప‌రిస్థితి తేవొద్ద‌ని అన్నారు. కానీ ఆ ప‌రిస్థితి వ‌చ్చేసింది. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా ప‌రిస్థితులు మారే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నారు. అందువ‌ల్ల లాక్‌డౌన్‌ను త‌ప్ప‌నిస‌రిగా విధించాల్సిందేనన్న భావ‌న‌కు వ‌స్తున్నారు.

దేశంలో లాక్‌డౌన్‌ను విధిస్తే త‌ప్ప కోవిడ్‌ను క‌ట్ట‌డి చేయ‌లేమ‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అమెరికాకు చెందిన ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇక ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో మోదీ లాక్ డౌన్ పెట్టాలా, వ‌ద్దా అనే విష‌యాన్ని చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే ప‌రిస్థితులు చేయి దాటిపోయాయి క‌నుక లాక్‌డౌన్ పెడితేనే బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రి మోదీ ఈ విష‌యంపై ఏం ప్ర‌క‌ట‌న చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now