Silver Anklets : మ‌హిళ‌లు కాళ్ల‌కు వెండి ప‌ట్టీల‌నే ధ‌రించాలి.. బంగారు వాటిని ధ‌రించ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

May 17, 2023 2:10 PM

Silver Anklets : స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల‌ లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుక‌నే అమ్మాయిలు క‌చ్చితంగా ప‌ట్టీల‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు. ఇక అదే అల‌వాటు కొన‌సాగుతూనే ఉంటుంది.

అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. అవి కూడా వెండివే ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడితో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు. అలా బంగారు పట్టిలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

women must wear Silver Anklets know the reasons
Silver Anklets

హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి. లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్లకు ధరించకూడదు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక సైన్స్ పరంగా చూస్తే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సజావుగా సాగుతూ పాదాల‌ వాపులు రాకుండా ఉంటాయి. అందుక‌నే మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా బంగారు ప‌ట్టీల‌ను కాకుండా వెండి ప‌ట్టీల‌నే ధ‌రించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment