ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌ని దేవుడికి నువ్వుల నూనె ఎందుకు స‌మ‌ర్పిస్తారో తెలుసా..?

Lord Shani Dev : జ్యోతిష్యశాస్త్రం ప్ర‌కారం శ‌నిని క‌ర్మ ప్ర‌ధాత అంటారు. వ్య‌క్తులు చేసే ప‌నుల‌ను బ‌ట్టి శ‌ని దేవుడు ఫ‌లితాలు ఇస్తాడు. అందుకే శ‌నిదేవుడు న్యాయ‌మూర్తిగా ప‌రిగ‌ణిస్తారు. ఎక్క‌డ చూసినా శ‌ని దేవుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధ‌న చేయ‌డం చూస్తుంటాము. శ‌నిదోషం, జీవితంలో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అయితే శ‌నిదేవుడికి నువ్వుల నూనెను స‌మ‌ర్పిస్తారు. అయితే శ‌నిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధ‌న‌, అభిషేకం ఎందుకు చేస్తారు ? దీని వెనుక కార‌ణాలేమిటి ? అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రావ‌ణుడు త‌న శ‌క్తితో గ్ర‌హాల‌న్నింటిని బంధించాడ‌ని చెబుతారు. శ‌ని దేవుడిని రావ‌ణుడు త‌న దుహంకారంతో త‌ల‌కిందులుగా వేలాడ‌దీశాడు. అదూ స‌మ‌యంలో హ‌నుమంతుడు శ్రీరాముని దూత‌గా త‌ల్లి సీత‌ను వెతుకుతూ లంక‌కు వెళ్లాడు. రావ‌ణుడు హ‌నుమంతుని తోక‌కు నిప్పంటించిన‌ప్పుడు హ‌నుమంతుడు లంక మొత్తాన్ని త‌గ‌ల‌బెట్టాడు.

మొత్తం లంకా ద‌హ‌నం చేయ‌డం వ‌ల్ల గ్ర‌హాల‌న్నీ స్వేచ్ఛ‌గా మారాయి కానీ త‌ల‌కిందులుగా వేలాడ‌డం వ‌ల్ల శ‌ని దేవుడు విముక్తి పొంద‌లేక శరీరం దెబ్బ‌తింది. శ‌నిదేవుడి బాధ‌ను త‌గ్గించ‌డానికి హ‌నుమంతుడు శ‌ని దేవుడి శ‌రీరాన్ని నూనెతో మ‌ర్ద‌నా చేసి నొప్పి నుండి విముక్తి క‌లిగించాడు. అప్పుడు శ‌నిదేవుడు భ‌క్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని స‌మ‌స్య‌ల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడ‌ట‌. అప్ప‌టి నుండి శ‌ని దేవుడికి నూనెను స‌మ‌ర్పించే సంప్ర‌దాయం మొద‌లైంది. మ‌రొక క‌థ ప్ర‌కారం రామాయ‌ణ కాండ‌లో శ‌ని దేవుడు త‌న బ‌లం, ధైర్యం త‌లుచుకుని గ‌ర్వ‌ప‌డేవాడు. హ‌నుమంతుని ధైర్య సాహాసాల గురించి తెలుసుకున్న శ‌ని దేవుడు ఆయ‌న‌తో పోరాటానికి బ‌య‌లుదేరాడు. శ‌ని దేవుడు హ‌నుమంతుడిని చేరుకున్న‌ప్పుడు హ‌నుమంతుడు నిశ్శ‌బ్ద ప్ర‌దేశంలో క‌ళ్లు మూసుకుని కూర్చుని శ్రీరాముని భ‌క్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గ‌ర్వంతో మునిగిపోయిన శ‌నిదేవుడు హ‌నుమంతుడిని యుద్దానికి ర‌మ్మంటూ గ‌ట్టిగా పిలిచాడు. అయితే ఇది స‌రికాద‌ని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నాన‌ని శ‌ని దేవుడికి హ‌నుమంతుడు వివ‌రించాడు.

Lord Shani Dev

కానీ శ‌ని దేవుడు హ‌నుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్దం చెయ్యాల్సిందేన‌ని మొండి ప‌ట్టు ప‌ట్టాడు. దీంతో హ‌నుమంతుడు యుద్దానికి దిగ‌క త‌ప్ప‌లేదు. చివ‌రికి శ‌ని దేవుడిని హ‌నుమంతుడు త‌న తోక‌తో చుట్టి బాగా దెబ్బ‌లు త‌గిలేలా కొట్టాడు. ఈ పోరులో శ‌ని దేవుడు ఘోరంగా ఓడిపోవ‌డ‌మే కాకుండా గాయ‌ప‌డ్డాడు. త‌రువాత శ‌ని దేవుడు నొప్పితో మూలుగుతూ హ‌నుమంతుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. శ్రీరాముడు, హ‌నుమంతుడి భ‌క్తుల‌ను తాను ఎన్న‌టికి వేధించ‌న‌ని హామీ ఇచ్చాడు. హ‌నుమంతుడు శ‌నిదేవుడి శ‌రీరానికి నూనె రాయ‌డంతో బాధ త‌గ్గింద‌ట‌. అందుకే ఎవ‌రైతే హృద‌య‌పూర్వ‌కంగా నాకు నూనె స‌మ‌ర్పిస్తారో , నేను అత‌ని బాధ‌ల‌న్నీ పోగొట్టి కోరిక‌ల‌ను తీరుస్తాన‌ని అని శ‌ని దేవుడు మాట ఇచ్చిన‌ట్టు పురాణాల్లో చెప్ప‌బ‌డింది. శ‌ని దేవుడుకి నూనె స‌మ‌ర్పించ‌డం వెనుక ఉన్న క‌థ‌నాలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM