Lord Shiva : శివుడు.. త్రిమూర్తులలో ఒకరు. సృష్టి, స్థితి కారకులు బ్రహ్మ, విష్ణువులైతే, అన్నింటినీ తనలో లయం చేసుకునే వాడు శివుడు. ఈ క్రమంలోనే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట ప్రచారంలోకి వచ్చింది. అయితే శివుడు నిజానికి మహాదేవుడైనా ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడు. ఇతర దేవుళ్లు వేసుకున్నట్టు ఆభరణాలు ధరించడు. పైగా శ్మశానాల్లో నివసిస్తాడు. ఒంటికి భస్మం రాసుకుంటాడు. అయితే ఇవన్నీ కాకుండా శివుడికి చెందిన విషయం ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే.. శివుడు ఎల్లప్పుడూ పులి చర్మాన్నే ధరిస్తాడు కదా. అదీ కింది భాగంలో.. పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదన ఉండదు. ఈ క్రమంలో శివుడు కేవలం పులి చర్మాన్నే ధరించడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం రండి..!
శివుడు ఒకప్పుడు దిగంబరుడే. ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించేవాడు కాదు. అయితే ఒకానొక సమయంలో శివుడు అరణ్యంలో వెళ్తున్నప్పుడు దిగంబరుడిగా ఉన్న ఆయన తేజస్సును చూసి రుషులు, మహర్షులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారట. ఆయన ముఖంలోని వెలుగుని చూసి ఆయన పట్ల ఆకర్షితులయ్యారట. అనంతరం శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆయన్నే తలచుకుంటూ నిత్యం కుటీరాల్లో పనులు కూడా సరిగ్గా చేసేవారు కారట. అయితే వారు అలా ఎందుకు చేస్తున్నారో వారి వారి భర్తలకు తరువాత తెలిసింది. దీంతో శివుడ్ని ఎలాగైనా హతమార్చాలనుకుంటారు. అందులో భాగంగానే వారు ఒక కుటిల ఉపాయం చేస్తారు.
శివుడు రోజూ వచ్చే దారిలో పెద్ద గుంతను తవ్వి పెడతారు. అందులో తమ మంత్రశక్తితో అత్యంత శక్తివంతమైన పెద్ద పులిని సృష్టించి ఉంచుతారు. అది సరిగ్గా శివుడు వచ్చే సమయానికి ఆయనపై ఒక్కసారిగా భీకర రూపంలో దాడి చేస్తుంది. అయినా శివుడు మహాదేవుడు కదా. ఏ జీవి అయినా ఆయన అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సిందే. దీంతో తనపై దాడికి వస్తున్న పులిని శివుడు చంపేస్తాడు. అనంతరం జరిగిన విషయం తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన అంగవస్త్రంగా కట్టుకుంటాడు. అప్పటి నుంచి శివుడు ఆ పులి చర్మాన్నే ధరిస్తూ వస్తున్నాడు. ఇదీ.. శివుడు పులి చర్మాన్ని ధరించడం వెనుక ఉన్న అసలు కారణం. దీని గురించి శివపురాణంలో వివరించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…