Lord Hanuman : సీతారామ దాసుడిగా రామ భక్తుడిగా విజయప్రదాతగా రక్షకుడిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి, కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుడి హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునుడికి ప్రియ సఖుడు. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీ సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి ప్రాణాలు నిలిపినవాడు. హనుమంతుడి నామాలు ప్రయాణం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం అస్సలు ఉండదట.
హనుమను స్మరించిన వారికి శుభం కలుగుతుంది. ధైర్య సాహసాలకు హనుమాన్ ప్రతిరూపం. ఆకాశమార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టిన ధీరుడు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ దశమినాడు జరుపుతారు. ఇక కేరళ రాష్ట్రంలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఇంతటి ఘనుడైన హనుమాన్ శ్రీరాముడి సేవకే పరిమితమయ్యాడు.
తన మనసులో శ్రీరామున్ని దాచుకున్నాడు. తన తల్లి కంటే ఎక్కువగా రామున్ని ఆరాధించాడు. అయితే ఒక రోజు సీతమ్మ నుదుటన సింధూరం పెట్టుకుంటుంది. మీరు ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నారు తల్లి అని అడిగితే. శ్రీరాముడు దీర్ఘాయుష్కుడుగా ఉండాలని పెట్టుకున్నాను.. అని చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది సీతమ్మ. దీంతో హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం రాసుకొని శ్రీరాముడిపై తన భక్తిని నిరూపించుకున్నాడు. శ్రీరాముడు ఇంకా ఎక్కువ ఆయుష్షుతో జీవించాలని చెప్పే హనుమ అలా తన శరీరం మొత్తం సింధూరాన్ని రాసుకున్నాడు. అందుకనే హనుమకు సింధూరం అంటే ఇష్టం. భక్తులు కూడా సింధూరంతో బొట్టు పెట్టుకుంటారు. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…