మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కార్యక్రమాలను ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. అయితే పెద్దవారు ఈ విధమైనటువంటి ఆచారవ్యవహారాలను పాటించడం వెనుక ఎంతో శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆచారాలను పెళ్లి కార్యక్రమాలలో ఎక్కువగా పాటిస్తుంటారు. పెళ్లిలో జరిగే ప్రతి వేడుకను ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు. అయితే పెళ్లిలో వరుడు వధువుకి నుదిటి పై బాసింగం కడతారు. ఈ విధంగా కట్టడానికి గల కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
పెళ్లిలో నుదుటిపై బాసింగం కట్టడం వెనక ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన మానవ శరీరంలో సుమారు కొన్ని వేల నాడులు ఉన్నాయి. ఈ నాడులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి.ఈ 14 నాడులు శరీరం ఉత్తేజంగా వుంచడానికి సహాయపడతాయి. ఇడ, పింగల,సుషుమ్మ, అనేవి ఎంతో ముఖ్యమైనవి.సుషుమ్మ, కుడి పక్కన సూర్యనాడి ఎడమ పక్కన చంద్రనాడి ఉంటాయి.
ఈ రెండు నాడులు నుదిటి పై అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అయితే వివాహ సమయంలో వీటిపై ఎవరి దృష్టి పడకుండా బాసింగం కడతారు. ఈ బాసింగాలు చతురస్రాకారం, త్రిభుజాకారంలో ఉంటాయి. అదేవిధంగా నుదిటిపై బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉంటారని ఎక్కువగా విశ్వసిస్తారు.అదేవిధంగా పెళ్లికి వచ్చిన అతిథుల దృష్టి వరుడు వధువు పై పడుతుంది. అయితే కొందరి నర దృష్టి వీరిపై పడకుండా బ్రహ్మ స్థానంలో బాసింగం కట్టడం ఆచారంగా వస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్‌తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్‌కు అనుకూలమైన కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్‌పై రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…