ఈ ప్రపంచానికి సకల ధర్మాలను తెలియజేసే భగవద్గీతను అందజేసిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తులు కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణాష్టమిని శ్రావణమాసం శుక్లపక్ష అష్టమి తిథి రోజు జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమిని శ్రీ కృష్ణ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. మరి శ్రీ కృష్ణాష్టమి రోజు భక్తులు ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
కృష్ణాష్టమి రోజు వేకువ జామునే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని పూజకు ఇంటిని మొత్తం అలంకరించుకోవాలి. అలాగే శ్రీకృష్ణుడి పాదాలను వేసి శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజించాలి. కృష్ణుడి విగ్రహం ముందు ఐదు వత్తులతో దీపారాధన చేసి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. కృష్ణాష్టమి రోజు స్వామి వారిని మూడు రకాలుగా ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయంలో కృష్ణుడికి పూజలు చేస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసముండి ఆ రోజు రాత్రికి కృష్ణుడి కథలు, ఆయన లీలలు వింటూ జాగరణ చేయాలి. అదేవిధంగా అష్టోత్తరం, శ్రీ కృష్ణ సహస్ర నామాలు, భాగవతంలోని దశమ స్కంధం చదువుతూ జాగరణ చేసి మరుసటి రోజు ఉపవాసం విరమించుకోవాలి. అలాగే మరికొందరు మహిళలు తమ చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి పూజించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…