శ్రీ కృష్ణాష్టమి పండగను ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఆ రోజు ఇంట్లో చిన్నపిల్లలను శ్రీ కృష్ణుడిలా, గోపికలలా తయారుచేసి బాగా సందడిగా జరుపుకుంటారు. తమ చిన్ని శ్రీకృష్ణులతో తమ ఇల్లు మొత్తం అడుగులతో నింపుతారు. ఇక ఈ పండుగను శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని పిలుస్తుంటారు. ఈ పండుగ రోజు ఉదయాన్నే స్నానమాచరించి షోడశోపచారాలతో కృష్ణుడికి పూజలు చేస్తారు.
ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమకూర్చుతారు. ఇంటిని మామిడాకు తోరణాలతో, పువ్వులతో అలంకరిస్తారు. శ్రీ కృష్ణ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి కొత్త వస్త్రాలను ధరిస్తారు. పువ్వులతో, ధూప దీపాలతో, నైవేద్యాలతో ఆయనకు పూజలు చేస్తారు. పూజ చేసే సమయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుడిపై మనసును నిమగ్నం చేయాలి.
కృష్ణుని తలుచుకొని అర్చిస్తే పాపాలు పోతాయి. బంగారం లేదా వెండితో లేదా చంద్రబింబాన్ని తయారుచేసి వెండి లేదా బంగారు పాత్రలో ఉంచి పూజ చేస్తే కోరికలు తీరుతాయి. సకల పాపాలు తొలగుతాయి. సంతానం లేనివారు సంతాన గోపాల మంత్రంతో కృష్ణుని పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది. ఇక పెళ్ళి కాని వారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేసినట్లైతే పెళ్లి జరుగుతుంది. ఇక ముఖ్యంగా గోవులకు ఆహారం పెడితే ప్రతి దేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఆ రోజు భక్తులు కృష్ణుడికి ఇష్టమైన ఆట ఉట్టి కొట్టడం వంటి సంబరాలు కూడా చేసుకుంటారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…