Meals : చాలా మంది టైం లేక హడావిడిగా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు. హడావిడిగా కొన్ని సార్లు మంచం మీద కూర్చుని చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. పెద్దలు లేదా పిల్లలు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్ళకి పట్టుకుంటుందని పెద్దలు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అన్నం తినేటప్పుడు మంచం మీద కూర్చుని తింటే అది రోగాలకి కారణం అవుతుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు కూడా దాని వల్ల కలుగుతాయి. కుటుంబంలో మనశ్శాంతి దూరమైపోతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ముందు భగవంతుడిని ప్రార్థించాలి. మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు కచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి. మన ఐదు వేళ్ళు స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజపరుస్తుంది.
అందుకని చేత్తో భోజనం చేయాలి. అన్నం తినేటప్పుడు మొదట దేవుడిని ప్రార్థించి తర్వాత ఐదు వేళ్ళతో నెమ్మదిగా అన్నం తినాలి. ఈరోజుల్లో చాలా మంది చేత్తో భోజనం తినడం మానేశారు. ఫ్యాషన్ కి పోయి స్పూన్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. పైగా టైం లేక నిలబడి లేదంటే మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. అవి తప్పు.
భోజనం తినేటప్పుడు ఇటువంటి పొరపాట్లను చేయకుండా చూసుకోండి. ఇలాంటి పొరపాట్ల వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు మొదట ఆవుకి పెడితే పుణ్యం కలుగుతుంది. మరి ఇక ఈసారి భోజనం చేసేటప్పుడు ఇటువంటి పొరపాట్లను చేయకుండా చూసుకోండి. లేకపోతే లేని పోని చిక్కుల్లో పడతారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…