వరలక్ష్మి వ్రతం రోజు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు ? తెలుసుకోండి..!

August 19, 2021 6:33 PM

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల అమ్మవారి కృప ఎల్లవేళలా మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వరలక్ష్మీ వ్రతం రోజు పెద్ద ఎత్తున మహిళలు ఉపవాసాలు ఉండి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించి ఈ వ్రతం ఆచరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేయాలి ? ఏ పనులు చేయకూడదు ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!

చేయాల్సిన పనులు

* వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు తప్పనిసరిగా ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.

* అమ్మవారి పూజ చేస్తున్నంత సేపు మనసు మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.

* వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వరలక్ష్మీ వ్రత కథ వినడం, చదవడం చేయాలి.

* అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

* పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయనం ఇవ్వడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.

చేయకూడని పనులు

* అమ్మవారికి వ్రతం చేయాలనుకునే వారు 2 రోజులపాటు శారీరక కలయికకు దూరంగా ఉండాలి.

* పూజ చేస్తున్నంత సేపు మన మనసును ఇతర అంశాలపై మళ్లించరాదు. మనసును అమ్మవారిపై ఉంచి భక్తితో పూజ చేసినప్పుడే ఫలితం ఉంటుంది.

* ఒకవేళ అమ్మవారి వ్రతం మనం ఆచరించక పోయినా ఇతరుల ఇంటికి వెళ్లేవారు మాంసాహారాన్ని ముట్టుకుని, తిని వెళ్ళకూడదు.

* బిడ్డకు జన్మనిచ్చి 22 రోజులు పూర్తి కాని వారు ఈ వ్రతంలో పాల్గొనకూడదు, ఈ వ్రతం చేయకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now