వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పాలు, నైవేద్యం ఇవే..!

August 20, 2021 11:51 AM

శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈరోజు మహిళలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సర్వ సంపదలు కలుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే వరలక్ష్మి పూజను చేస్తూ.. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి ఏ విధమైన పుష్పాలతో అలంకరించాలి, ఏ విధమైన నైవేద్యాలను సమర్పించాలి అనే విషయానికి వస్తే..

వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృప మనపై ఉండాలంటే తప్పనిసరిగా అమ్మవారికి మల్లె పువ్వులు, కలువ పువ్వులు, సంపంగి పువ్వులు, మొగలి పువ్వులతో పూజ చేయటం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం తొమ్మిది రకాల పిండి వంటలు తయారు చేయాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, పరమాన్నం, చలిమిడి, వడపప్పు, శనగలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెంది ఆమె అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని భావిస్తారు. అయితే అందరికీ ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించడం కుదరదకపోతే మనకు వీలైనంత వరకు మూడు లేదా ఐదు రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now