శ్రావణ మాసంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు!

August 14, 2021 2:03 PM

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో నిత్యం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరికొందరు శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన సోమవారం, మంగళవారం, శుక్ర ,శని వారాలలో ఉపవాసం ఉంటారు. ఈ విధంగా ఉపవాసం ఉన్నవారు శ్రావణ మాసంలో కొన్ని ఆహార పదార్థాలను అసలు ముట్టకూడదని పండితులు చెబుతున్నారు.మరి శ్రావణ మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నవారు లేదా ఇతరులు కూడా ఆకుకూరలను, వంకాయలను తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని ఈ మాసంలో తినడం వల్ల అశుభం కలుగుతుందని చెబుతారు.  అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. సాగర మధనం చేస్తున్న సమయంలో రాక్షసులు అయినా రాహువు కేతువు దేవతలుగా మారి అమృతాన్ని తాగడంతో విష్ణుమూర్తి వారి శిరస్సులు ఖండిస్తాడు. ఈ విధంగా శిరస్సు ఖండించడం వల్ల వారి గొంతులో నుంచి అమృతం బయటకు వస్తుంది.

ఈ విధంగా గొంతులో నుంచి అమృతం బయటకు వచ్చినప్పుడు అమృతం నుంచి ఉల్లిపాయ వెల్లుల్లి ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినడం వల్ల వారికి కూడా రాక్షస ఆలోచనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మాంసం చేపలను కూడా ఈ మాసంలో ముట్టుకోకూడదు. చేపలు తన సంపదను వృద్ధి చేసుకోవడానికి ఈ మాసం ఎంతో అనుకూలమైనది కనుక ఈ మాసంలో చేపలు తినకూడదనీ చెబుతారు. ఇక మత్తు పదార్థాలను కూడా ఈ మాసంలో తీసుకోకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now